AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మరోసారి ఫార్ములా ఈ-రేస్..

Hyderabad: FIA Formula- E Race: రయ్.. రయ్‌మంటూ మరోసారి ఫార్ములా ఈ-వన్ రేసింగ్ కార్లు భాగ్యనగరంలో దూసుకుపోనున్నాయ్. మళ్లీ ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్‌ హైదరాబాద్ నడిబొడ్డున జరగనుంది. వచ్చే ఏడాది కూడా ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్టు ఎఫ్ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ వెల్లడించింది.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మరోసారి ఫార్ములా ఈ-రేస్..
Formula One
Ravi Kiran
|

Updated on: Oct 20, 2023 | 10:43 AM

Share

హైదరాబాద్, అక్టోబర్ 20: రయ్.. రయ్‌మంటూ మరోసారి ఫార్ములా ఈ-వన్ రేసింగ్ కార్లు భాగ్యనగరంలో దూసుకుపోనున్నాయ్. మళ్లీ ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్‌ హైదరాబాద్ నడిబొడ్డున జరగనుంది. వచ్చే ఏడాది కూడా ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్టు ఎఫ్ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ వెల్లడించింది. 2024, ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ-ఫార్ములా 10వ ఏబీబీ ఎఫ్ఐఏ సీజన్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. గురువారం సమావేశమైన ఎఫ్ఐఏఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్.. 2024 ఫార్ములా ఈ-రేసింగ్‌పై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాల్యుషాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేసింగ్ పోటీలపై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఈ ఏడాది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఫార్ములా-ఈ రేసు’ నగర ఆర్ధిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపించినట్టు నీల్సన్‌ స్పోర్ట్స్‌ అనాలసిస్‌ అధ్యయనంలో వెల్లడైంది. ‘ఫార్ములా-ఈరేసు’ కారణంగా ఆర్ధిక వ్యవస్థ దాదాపు రూ. 700 కోట్ల మేరకు పుంజుకుందని తెలుస్తోంది.

2023, ఫిబ్రవరి 11న తొలిసారిగా హుస్సేన్‌సాగర్‌ తీరాన ‘ఫార్ములా-ఈ’ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పలు దేశాల నుంచి విచ్చేసిన 11 టీంలు పాల్గొన్నాయి. అలాగే 31 వేల మంది ప్రేక్షకులు ఈ-రేసింగ్‌ను లైవ్‌లో వీక్షించారు. వీరిలో 59 శాతం మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అలాగే 150 దేశాల నుంచి ప్రేక్షకులు ఆన్‌లైన్ ద్వారా వీక్షించారు. కాగా, ఈ రేసింగ్ ఈవెంట్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిన్‌ వెర్గ్‌నే నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో నిక్‌ క్యాసిడీ, సెబాస్టియన్‌ నిలిచారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్