J. Jayalalithaa House: హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. ఎందుకంటే..
హైదరాబాద్ నగరంలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఇల్లును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయి ఉండటంతో అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరం యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్-38 పరిధి శ్రీనగర్‌కాలనీలో జీ+4తో నిర్మించిన భవనం జె.జయలలిత పేరుతో ఉంది.

హైదరాబాద్ నగరంలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఇల్లును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయి ఉండటంతో అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరం యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్-38 పరిధి శ్రీనగర్‌కాలనీలో జీ+4తో నిర్మించిన 8-3-1099/ఎ (పీటీఐఎన్ నంబర్: 1100833474) భవనం జె.జయలలిత పేరుతో ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు.. 2017 నుంచి పేరుకుపోయాయి.. దీంతో ఉప కమిషనర్ సురేశ్ ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులిచ్చారు. అయినప్పటికీ.. వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం భవనాన్ని సీజ్ చేశారు.
ఓటీఎస్ స్కీమ్ మార్చి 31 వరకు అమలులో ఉన్నందున రాయితీ పోను రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. గతంలో ఈ భవనంలో ప్రైవేటు కార్యాలయం నిర్వహించారని.. దీంతో వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించినట్లు అధికారులు తెలిపారు.2017 నుంచి ఈ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్‌గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ జీహెచ్‌ఎంసీ అధికారులను గతంలో కోరారు.
అయితే.. ఈ క్రమంలోనే.. జయలలిత నివాసానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు కట్టాలని.. ఫిబ్రవరిలో నోటీసులు ఇవ్వగా.. వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఏఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం నాడు జయలలిత బిల్డింగ్‌ను సీజ్ చేశారు.
