
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని జగదేపూర్ మండలం మునిగడప వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడి.. కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో కారులు ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు బీబీ నగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..