Fire Accident: గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. రోగులను ఇతర వార్డుకు తరలింపు
Fire Accident: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లేబర్ రూమ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆస్పత్రి..
Fire Accident: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లేబర్ రూమ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు. మంటలు చెలరేగుతున్నా.. అగ్నిమాపక సిబ్బంది సమయానికి రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రోగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరుగగానే ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే షార్ట్ సర్య్కూట్ కారణంగా విద్యుత్ బోర్డు ప్యానెల్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. స్వల్పంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
స్వల్ప ప్రమాదమే: గాంధీ సూపరింటెండెంట్ రాజారావు
ఈ రోజు ఉదయం ఆస్పత్రిలోని విద్యుత్ సంబంధించిన గదిలో అగ్నిప్రమాదం జరిగిందని, కేవలం నిమిషాల వ్యవధిలోని మంటలు అదుపులోకి తీసుకువచ్చినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో తెలిపారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కొంత మంది సిబ్బందికి ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలో అనేదానిపై శిక్షణ ఇచ్చామని అన్నారు.
ఆస్పత్రిలోఫైర్‌సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయని, కరోనా సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాలన్ని ఇక్కడ అమర్చినట్లు తెలిపారు. నార్త్ బ్లాక్‌లో ప్రస్తుతం పెషేంట్‌లు లేరని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులను పక్కవార్డులోకి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నామని అన్నారు.