Telangana: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. వరుస రియాక్టర్ల పేలుడుతో ఆ ప్రాంతమంతా భయానకం..

|

Aug 22, 2022 | 1:14 PM

ఒకదాని తరువాత ఒకటి వరుస పేలుళ్లతో సమీప ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు జీడిమెట్ల, కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్‌లతో..

Telangana: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. వరుస రియాక్టర్ల పేలుడుతో ఆ ప్రాంతమంతా భయానకం..
representative image
Follow us on

Telangana: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరోమారు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ వి కోపరేట్ లో ఉన్న శ్రీధర్ బయో టెక్ లో రియాక్టర్లు పేలాయి. సోమవారం ఉదయం ఒకే సమయంలో నాలుగు రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. ఒకదాని తరువాత ఒకటి వరుస పేలుళ్లతో సమీప ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు జీడిమెట్ల, కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్‌లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఈ ప్రమాదంలో కార్మికులు లక్ష్మణ్ నాయుడు, వెంకట్ రమణ రెడ్డి, ప్రవీణ్, కృష్ణ రెడ్డి, జామీర్, నరసింహారావు, శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిలో జమీర్ 70 శాతం గాయాలతో శంకర్, నర్సింహ 50 శాతం గాయాలతో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి