Valentine’s Day: ఫిబ్రవరి 14 పై విహెచ్‌పి, భజరంగ్‌ దళ్ నేతల కీలక ప్రకటన.. ఇంతకీ వారేమన్నారంటే..

|

Feb 10, 2022 | 6:05 PM

Valentine's Day: తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, కేవలం విదేశీ విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకం అని విశ్వ విందు పరిషత్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎం రామరాజు అన్నారు.

Valentines Day: ఫిబ్రవరి 14 పై విహెచ్‌పి, భజరంగ్‌ దళ్ నేతల కీలక ప్రకటన.. ఇంతకీ వారేమన్నారంటే..
Follow us on

Valentine’s Day: తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని, కేవలం విదేశీ విష సంస్కృతికి మాత్రమే వ్యతిరేకం అని విశ్వ విందు పరిషత్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎం రామరాజు అన్నారు. ‘మన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమైన ప్రేమికుల రోజుకు మేం పూర్తిగా వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విహెచ్‌పి, భజరంగ్ దళ్ నేతలు రామరాజు, శివ రాములు మీడియాతో మాట్లాడారు. ఇది ఒక విష సంస్కృతి అని, ప్రభుత్వాలు కూడా వాలంటైన్స్ డే ను నిషేధించాలని డిమాండ్ చేశారు. వాలెంటైన్స్‌ డే ని నిషేధించి.. భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజు పేరుతో యువత ఎవరైనా ఫిబ్రవరి 14న విచ్చలవిడిగా బయట తిరిగితే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు అని చెప్పుకుని కొందరు ప్రేమికుల రోజున యువతి, యువకులకు పెళ్లిళ్లు చేస్తున్నారని అన్నారు. తాము అలా చేయబోమన్నారు. వాలంటైన్స్ డే అనే విదేశీ సంస్కృతిని కొన్ని కార్పొరేట్ కంపెనీలు మన దేశంపై రుద్దాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ప్రేమికుల రోజు జరుపవద్దని పబ్బులు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌లను హెచ్చరిరంచారు తెలంగాణ ప్రాంత భజరంగ్ దళ్ ప్రముఖ్ శివ రాములు. యువతలో జాతీయ వాదాన్ని పెంపొందించడానికి ప్రేమికుల రోజు వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్తంగా గ్రీటింగ్ కార్డుల దహనం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు భజరంగ్ దళ్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పుల్వామాలో అమరులైన సైనికులను స్మరిస్తూ ‘‘అమర జవాన్ దివస్‌’’ గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14ను ‘‘అమర జవాన్ దివస్’’ గా జరుపుకొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తామని చెప్పారు. ప్రేమికులపై దాడలు చేయబోమని, కానీ, వారు బయట కనిపిస్తే అమరవీరులపై అవగాహన కల్పిస్తామని చెప్పారు శివ రాములు.

Also read:

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!

Viral Video: ఓ మై గాడ్.. అదృష్టం అంటే ఇతనిదే.. కొంచెం తేడా అయినా ప్రాణాలే పోయేవి..

Andhra Pradesh News: తెల్లారితే యువకుడి పెళ్లి.. ఆమె ఎంట్రీతో కథంతా రివర్స్ అయ్యింది.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..