రంగరెడ్డి జిల్లా: కూతురు వరస అయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. యువతి తండ్రితో సహా మరో నలుగురు కలిసి ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గత నెల 15న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యువకుడిని హత్య చేసి, పాటి పెట్టి పరారయ్యారు. నెల అనంతరం ఓ మహిళతో ఫోన్ మాట్లాడుతూ పోలీసులకు చిక్కారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన కరణ్ కుమార్ కోళ్ల ఫారంలో కూలీ పనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబంతొ సహా ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్ల ఫారంలో పని చేస్తున్నాడు. కరణ్ కుమార్, రంజిత్ కుమార్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరు వరుసకు సోదరులు. అయితే కరణ్ కుమార్ వావివరసలు మరిచి రంజిత్ కుమార్ కూతురుని ప్రేమించాడు. ఇద్దరి మధ్య సానిహిత్యం పెరిగింది.
అయితే విషయం తెలుసుకున్న రంజిత్.. కరణ్ కుమార్‌ను పలుమార్లు మందలించినా అతను వినిపించుకోలేదు. ‘నీకు కూడా కూతురే అవుతుంద’ని చెప్పినా కరణ్ కుమార్ ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో కరణ్‌ను రంజిత్ గట్టిగా బెదిరించాడు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం కరణ్ సిద్దిపేటకు వెళ్లి పనిలో కుదిరాడు. అక్కడి వెళ్లినా అతనిలో మార్పు రాలేదు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు పోస్ట్ చేసేవాడు. ఇలా కరణ్ చేస్తున్న పనులతో విసిగి పోయిన రంజిత్.. కరణ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయమైన వ్యక్తులైన బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్, బబ్లు మరో ఇద్దరి మైనర్లు సహాయం తీసుకున్నాడు.. ఇలా రంజిత్ పథకం ప్రకారం ఆగస్టు 15న కరణ్ ఫోన్ చేశాడు. పొలంలో పని ఉందని రమ్మని చెప్పి జూలపల్లి మధ్య రహదారి పక్కకు తీసుకెళ్లాడు.
అక్కడే బురద నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాచాడు.. అనంతరం అక్కడే పాతి పెట్టాడు. అయితే తన తమ్ముడు కనిపించలేదు అంటూ కరణ్ అన్న దీపక్ గత నెల 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు రంజిత్ హత్య చేసినట్లుగా గుర్తించారు.. హత్య జరిగిన అనంతరం నిందితులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే అనంతరం ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తల దాచుకున్నట్లు గుర్తించారు. కేశంపేట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..