
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోగా, ఇప్పటికే కాసిన పిందెలు నేలకొరిగాయి. జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల్లో రాత్రి వేళ కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి, ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంభీరావుపేట మండలంలో మంచు గడ్డల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, రాళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో పొట్టదశలో ఉన్న, కోతకు వచ్చిన వరిచేలు దెబ్బతిన్నాయి.
మండలకేంద్రం తోపాటు దమ్మన్నపేట, నాగంపేట, జగదాంబతండా, గోరింటాల, లింగన్నపేట, నర్మాల గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. చెట్లు, విద్యుత్తస్తంభాలు విరిగి పడ్డాయి. వీర్నపల్లి మండలంలోని వన్పల్లి, గర్జనప ల్లి, అడవిపదిర, రంగంపేట గ్రామాల్లో వడగండ్ల వానతో వరి పంటకు నష్టం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు పోతుగల్, గూడెం, ఆవు నూర్, నామాపూర్ గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15వేలు పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..