ఆ రైతు ఎప్పటిలానే చేపల వేట కోసం స్థానికంగా ఉన్న ఓ కాల్వ వద్దకు వెళ్లాడు. ఈసారి తనతో పాటు ఎలాంటి గాలం, వల లాంటివి తీసుకురాలేదు. కానీ కాల్వలోకి దిగి ఏకంగా మ్యాజిక్ చేశాడు.. అతడి ఏం చిక్కిందో తెలిస్తే మీరూ షాక్ కావడం ఖాయం. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజా మండలం భూంపూర్ గ్రామంలోని నెట్టెంపాడు కాల్వలోకి సోమవారం హనుమంతు అనే రైతు చేపల వేటకు దిగాడు. అతడికి ఓ పొడవైన చేప చిక్కడం గమనార్హం. 5 అడుగులకు పైగా పొడవు, 10 కిలోలకు పైగా బరువున్న కొరమీనం చేప అతడికి చిక్కింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ చేపను పట్టుకునేందుకు అతడు ఎలాంటి గాలం వినియోగించలేదు. అలాగే ఆ చేప కాల్వలో కనిపించగానే ఎలాంటి వల లేకుండానే చాకచక్యంగా పట్టుకున్నాడు సదరు రైతు.
ఇది చదవండి: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి