BJP Fake Videos: మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌.. కమలదళంలో కలవరం..!

నిజం నోరు దాటే లోపు అబద్ధం ఊరు చుట్టి వస్తోంది. కమలం నేతలు ఒకటి మాట్లాడితే మరో విషయం జనాల్లోకి వెళ్తోంది. మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌ నడుస్తోంది. లేటెస్ట్‌గా మరో రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుండడం భారతీయ జనతా పార్టీ నాయకులకు టెన్షన్‌ మొదలైంది.

BJP Fake Videos: మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌.. కమలదళంలో కలవరం..!
Fake News

Updated on: May 08, 2024 | 5:28 PM

నిజం నోరు దాటే లోపు అబద్ధం ఊరు చుట్టి వస్తోంది. కమలం నేతలు ఒకటి మాట్లాడితే మరో విషయం జనాల్లోకి వెళ్తోంది. మార్ఫింగ్‌ వీడియోలతో ఫేక్‌ క్యాంపెయిన్‌ నడుస్తోంది. లేటెస్ట్‌గా మరో రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తుండడం భారతీయ జనతా పార్టీ నాయకులకు టెన్షన్‌ మొదలైంది.

ఒక్క వీడియో.. ఒకే ఒక్క వీడియో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనల్ని రేపింది. దేశ రాజకీయాల్ని షేక్‌ చేసింది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ ఆఖరకు అరెస్ట్‌ల దాకా వెళ్లింది. ఇంత జరిగినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అమిత్‌ షా ఫేక్‌ వీడియో మర్చిపోకముందే మరిన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కౌంటర్‌గా బీజేపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.

లేటెస్ట్‌గా మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మార్ఫింగ్‌ వీడియో నెట్టింట్‌లో వైరలవుతోంది. మల్కాజ్‌గిరి ఓటర్లు ప్రలోభాలకు లొంగుతారంటూ ఈటల రాజేందర్‌ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు ప్రత్యర్థులు. దీనిని పసిగట్టిన బీజేపీ నేతలు కాంగ్రెస్‌ పనేనంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వీడియో షేర్ చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు ఈసీ అధికారులు.

ఇక కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌నూ ఫేక్‌ క్యాంపెయిన్‌ షేక్‌ చేస్తోంది. అమిత్‌షా మాదిరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బండి సంజయ్ చెబుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ నేతలు వెంటనే అలర్టయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి బీజేపీ లీడర్లు కంప్లయింట్‌ చేశారు. తప్పుడు పోస్టులతో జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు.

ఇటీవల అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా నిర్వాహకులు అరెస్టయ్యారు. ఈ ఘటన జరిగి రోజులు గడవక ముందే ఫేక్‌ వీడియోలు మరిన్ని పుట్టుకురావడం కమలం లీడర్లను కలవరపెడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..