Extra Marital Relationship: అక్షరం ముక్క రాదు కానీ.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను..

|

Jan 12, 2022 | 6:03 PM

Extra Marital Relationship: ఆమెకు అక్షరం ముక్క కూడా చదవడానికి రాదు. కానీ సోషల్ మీడియాను మాత్రం తెగ వాడేస్తుంది. ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడ్ని

Extra Marital Relationship: అక్షరం ముక్క రాదు కానీ.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను..
Follow us on

Extra Marital Relationship: ఆమెకు అక్షరం ముక్క కూడా చదవడానికి రాదు. కానీ సోషల్ మీడియా(Social Media)ను మాత్రం తెగ వాడేస్తుంది. ఫేస్ బుక్(Facebook) ద్వారా ఓ యువకుడ్ని పరిచయం చేసుకుంది. పరిచయం కాస్త అక్రమ(Illegal Relationship) సంబంధంగా మారింది. అది కాస్త భర్తకు తెలియడంతో.. భర్త అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడు, అతని స్నేహితుడితో పక్కా స్కెచ్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం కట్టుకున్న భర్తను హత్య చేయించింది. అనంతరం మృత దేహాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి.. ఊచలు లెక్కబెడుతున్నారు నిందితులు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వివరాల్లోకెళితే.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మొద్దు మాధవి, వెంకటేష్‌కు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వెంకటేష్ ఇల్లరికం వచ్చి అత్త, మామ ఊర్లోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు శివరాం, సతిష్, సంగీత ఉన్నారు. మొద్దు మాధవి రోజు వారి కూలీ గా బుద్ధరం గ్రామపంచాయతీలో పనిచేస్తుంది. వీరి జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో 6 నెలల క్రితం మొద్దు మాధవి వాళ్ళ తండ్రి మరణించడంతో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వచ్చాయి. దీంతో ఆమె ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. వాట్సాప్, ఫేస్బుక్ ఉపయోగించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫేస్ బుక్ లో జంగం రమేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రియుడితో రోజూ గంటల తరబడి మాట్లాడేది మాధవి. కొంతకాలానికి భర్త వెంకటేష్ కు ఈ విషయం తెలిసింది. మాధవిని మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు జంగం రమేష్ తో కలిసి ఓ పథకం పన్నింది. ప్రియుడు రమేష్ స్నేహితుడు దోమ కురుమయ్య తో కలిసి ప్లాన్ అమలు చేయాలనుకున్నారు.

పథకం ప్రకారం హత్య చేయాలని ముందుగా మాట్లాడుకున్నారు. వారు అనుకున్న సమయం రానే వచ్చింది. భర్త వెంకటేశ్ కూలి పనికి వెళ్లి వచ్చి రాత్రి నిద్రపోయాడు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇంట్లో కరెంట్ తీసేసింది మాధవి. ఆ తర్వాత ప్రియుడు రమేశ్ కు సమాచారం అందించింది. దాంతో రమేష్ తన స్నేహితుడితో కలిసి మాధవి ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న మాధవి భర్త వెంకటేష్‌కు మత్తు ఇంజక్షన్ వేశారు. వెంకటేష్ ప్రతిఘటించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఆ పక్కనే నిద్రిస్తున్న పిల్లలు లేచి అరవడం మొదలుపెట్టారు. దీంతో పిల్లలను నోరు మూయించింది మాధవి. మిమ్మల్ని కూడా చంపుతానంటూ పిల్లలను భయపెట్టింది. ఆ చిన్నారుల ముందే కన్న తండ్రిని తల్లి మాధవి, ఆమె ప్రియుడు జంగం రమేష్, అతని స్నేహితుడు కురుమయ్య కలిసి గొంతుకు చున్నీ వేసి క్రూరంగా చంపేశారు. తమ కళ్ల ముందే తండ్రిని అత్యంత కిరాతకంగా హతమార్చారని, తండ్రి ఎదిరించే ప్రయత్నం చేశాడని, తాము కూడా అరుపులు కేకలు పెట్టినా లాభం లేకుండాపోయిందని మృతుడి పిల్లలు బోరున విలపించారు.

ఇదిలాఉంటే.. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలని ప్లాన్ వేశారు నిందితులు. జంగం రమేష్, కురుమయ్య కలిసి వెంకటేష్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లారు. వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని కోస్గి వైపు తీసుకెళ్తుండగా హన్వాడ పోలీసులు పెట్రోలియం నిమిత్తం తిరుగుతూ వీరిని గమనించారు. వెంటనే వారిని ఆడ్డగించి ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్నాడని ఇంటికి తీసుకెళుతున్నామని సమాధానం చెప్పడంతో అనుమానంతో తట్టి చూశారు. వెంకటేష్ అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది. ఈ వ్యవహారంలో అసలు పాత్రదారి అయిన భార్య మాధవిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. నిందితులందరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ కిషన్ తెలిపారు.

కాగా, ఈ వ్యవహారంపై ఇక ముందు తమ గ్రామంలోకి ఆమెను రానిచ్చేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ప్రియుడి మోజులో భర్తను చంపి భార్య జైలుకు వెళ్లింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. చిన్నారులను అన్ని విధాలుగా తాము ఆదుకుంటాం, ప్రభుత్వం తరపున కూడా ఆదుకోవాలి.’’ అని గ్రామ సర్పంచ్ చెన్నయ్య కోరుతున్నారు.

Also read:

Telangana: సంక్రాంతి తరువాత అక్కడికి వెళతాం.. వనామా వ్యవహారంలో వీహెచ్ కీలక వ్యాఖ్యలు..

Nivetha Pethuraj: న్యూ ఫోటోషూట్ తో ఎట్రాక్ట్ చేస్తున్న నివేత పేతురాజ్.. (ఫోటోస్)

Corona Fund: కోవిడ్‌ ఫండ్‌ నుంచి ఒక్కొక్కరికి రూ.5వేలు.. జనవరి 15 వరకే అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం