Telangana: బీఆర్ఎస్ లీడర్స్‌ను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వ.. పొంగులేని శ్రీనివాస్ సంచలన కామెంట్స్..

|

Apr 16, 2023 | 8:45 PM

కేసీఆర్‌ను గద్దె దించడానికి ఏ పార్టీ సరైందో ఆ పార్టీలోనే చేరుతానని బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీవీ9 బరాబర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ఎన్నికలు, అధికారంపై కీలక కామెంట్స్ చేశారు. మరి పొంగులేటి చేసిన కామెంట్స్, ఆయన నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు?

Telangana: బీఆర్ఎస్ లీడర్స్‌ను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వ.. పొంగులేని శ్రీనివాస్ సంచలన కామెంట్స్..
Ponguleti Srinivas Reddy
Follow us on

కేసీఆర్‌ను గద్దె దించడానికి ఏ పార్టీ సరైందో ఆ పార్టీలోనే చేరుతానని బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీవీ9 బరాబర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ఎన్నికలు, అధికారంపై కీలక కామెంట్స్ చేశారు. మరి పొంగులేటి చేసిన కామెంట్స్, ఆయన నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ఆయనతో ఎవరెవరు కలిసి రానున్నారు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ పార్టీలో చేరబోతున్నారు?

కేసీఆర్‌ను గద్దె దించడానికి ఏ పార్టీ సరైందో ఆ పార్టీలోనే చేరుతానని పొంగులేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవ్వరినీ ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనని భీష్మించారు. దొరల గడీల నుంచి విముక్తి అయ్యానని, కేసీఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణ విముక్తి కావాలని కావాలని అన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం, వ్యక్తిగ‌త ల‌బ్ది కోసం బీఆర్‌ఎస్‌లో చేర‌లేదన్నారు. నాలుగేళ్లుగా కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు పొంగులేటి. ప్రజ‌ల అవ‌స‌రాల కోసం క‌లుద్దామ‌మన్నా కేసీఆర్‌ ప‌ట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ తనను పార్టీలో చేరాల‌ని కోరుతున్నాయని చెప్పారు పొంగులేటి. కాంట్రాక్ట్‌లు వేరు, రాజ‌కీయాలు వేరు అని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం అయితే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉండేవాడినని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ బిల్లులు ఇవ్వకుండా బ్లాక్ మెయిల్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎవ‌రికి ఎంత క‌మీష‌న్ ఇచ్చారో మొత్తం చిట్టా బయ‌ట‌పెడతానని ప్రకటించారు. దొర‌ల గ‌డీల‌ నుంచి తెలంగాణ విముక్తి అయ్యేవ‌ర‌కు పోరాడతానని భీష్మ ప్రకటన చేశారు పొంగులేటి. ఖ‌మ్మం ప్రజ‌ల ఆశీస్సుల‌తో కేసీఆర్ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడతానని, జూప‌ల్లితో పాటు మ‌రో కొంత‌మంది కేసీఆర్ నియంతృత్వాన్ని.. వ్యతిరేకించేవాళ్లతో చేతులు క‌లుపుతానని పొంగులేటి చెప్పారు.

ఇవి కూడా చదవండి

పొంగులేని శ్రీనివాస్ రెడ్డి ఫుల్ ఇంటర్వ్యూ కింది వీడియోలో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..