Evil Fish in Telangana: మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు ప్రమాదకరమైన దెయ్యం చేప దొరికింది. ఇది అరుదైన చేప. అంతేగాక ప్రమాదకరమైంది కూడా. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తింటూ తాను జీవనం సాగిస్తుంటుంది. తద్వారా చేపల సాగులో మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే, తాజాగా దొరికిన చేపను చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. క్యాట్ పిష్ జాతికి చెందిన చేపను ఈ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి.
అమెరికాలోని అమెజాన్ నదిలో మాత్రమే లభించే ఈ చేప ఇక్కడ లభించడంతో నిపుణులు, జాలరులు ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యపు చేప, బల్లిచేప అని కూడా పిలుస్తారు. దీన్ని ఆక్వేరియం లలో పెంచుతారు. అమెజాన్ సైల్ఫీన్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి చేపను తాము ఎప్పడు చూడలేదని జాలర్లు చెబుతున్నారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సాగు చేసే చేపల్ని తినేసి, రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తాయి. అత్యంత హానికరమైన ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకుపైగా బతకగలదు. నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని పెంచుకోగలదని నిపుణులు చెబుతున్నారు.
Also read:
Lions Roaming: అర్థరాత్రి వేళ హల్ చల్ చేస్తున్న సింహాలు.. సీసీ విజువల్స్ చూసి హడలిపోతున్న జనాలు..
TTD Darshan Tickets: బాప్‌రే ఇంత డిమాండా?.. 55 నిమిషాల్లో 4.60 లక్షల టికెట్ల బుకింగ్..!