
25 కోట్ల పంచాయితీ.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈటల ఆరోపణలు.. బీజేపీ.. కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ సైతం రంగంలోకి దిగింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనన్న బీజేపీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది.. బీజేపీ, కాంగ్రెస్ రెండూ జతకట్టాయంటూ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో 25 కోట్ల పంచాయితీపై ఈటల రాజేందర్ మళ్లీ మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ కు 25 కోట్లు ఇచ్చిందన్న విషయంలో మొన్న తాను రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదంటూ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, BRS ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాయని.. రాహుల్ కేసులో కాంగ్రెస్ కంటే BRS ఎక్కువ స్పందించిందని అన్నారు.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెడతారని అనుకోలేదని, ధీరుడు ఎప్పుడజ కన్నీరు పెట్టరని అన్నారు.
జానారెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్లు, చివరకు ఖర్గే కూడా బిఅర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సంకేతాలు ఇస్తున్నారని.. సీఎం కాలేనని రేవంత్ రెడ్డి కన్నీరు కార్చారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బిఆర్ఎస్ తో పొత్తుకు సిద్దమని ఢిల్లీలో చెబుతున్నారన్నారు. 2014 నుంచి కాంగ్రెస్ ను ఖతం చేయాలని కేసీఆర్ చూశారు.. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో హుజురాబాద్ ఎన్నికలో ఎంత ఖర్చుపెట్టారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటూ ప్రశ్నించారు.
కన్నీరు పెడుతూ దుర్భాషలాడారు.. విద్యార్థి దశ నుంచి ఉద్యమం వరకు ఎన్నో సార్లు జైలుకి వెళ్ళా.. తెలంగాణ కోసం నేను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ..? అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగుర వేశాం.. ఓటుకు నోటు లాంటి కేసులో జైలుకు పోయిన మీకు మాకు పోలిక ఎక్కడ..?మేము ప్రజల కోసం జైలుకు పోతే.. మీరు ఓటుకు నోటు లాంటి కేసులతో జైలుకి పోయారంటూ విమర్శించారు.
నీ అమ్మ అంటూ మాట్లాడావు. నేను మాట్లాడలే నా..? కానీ నేను మాట్లాడను. నీకు అమ్మ లేదా. తెలంగాణ బిడ్డనే కదా అమ్మ.. మీ ముసలి కన్నీరును తెలంగాణ ప్రజలు నమ్మరు.. మీరు కేసీఆర్ తో జట్టు కడుతున్నారా.? చిల్లర మాటలు.. ఈ పిచ్చి వేషాలు మానుకో.. దమ్ము లేక మా మీద అక్కసు పెట్టుకుంటే బాగుండదు అంటూ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా చూసుకుందాం.. దమ్ముందా.. తేల్చుకుందాంరా.. నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో రండి అంటూ ఈటల సవాల్ చేశారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిల మునుగోడు క్యాష్ ఎపిసోడ్‌ను పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు BRS ఎమ్మెల్యే దానం నాగేందర్. రేవంత్‌కు దమ్ముంటే ఈటలపై పరువు నష్టం దావా వేయాలని దానం సవాల్ చేశారు. ఇతర పార్టీల నేతలకు డబ్బులిచ్చే ఖర్మ BRSకు లేదన్నారు దానం. ఇద్దరిదీ పొలిటికల్ డ్రామా అన్న దానం నాగేందర్.. రేవంత్‌కు దమ్ముంటే ఈటలపై పరువునష్టం దావా వేయాలన్నారు. ఆలయం పక్కనే హైకోర్టు ఉంది.. అక్కడ తేల్చుకోండి అంటూ సూచించారు.
కాంగ్రెస్ పార్టీపై BJP విమర్శల్ని తిప్పికొట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. BRS అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్, అమిత్‌షా ఇద్దరూ ఒక్కటేనంటూ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయంటూ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఈటల మాటలు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తెలుపుతున్నాయంటూ కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..