Telangana:తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కూల్స్​లో ఇంగ్లీషు మీడియం

|

Jan 17, 2022 | 7:06 PM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.

Telangana:తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కూల్స్​లో ఇంగ్లీషు మీడియం
Telangana Schools
Follow us on

CM KCR: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ రెండు అంశాలపై అనాలిసిస్ చేసేందుకు, విధి విధానాలను రూపొందించేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ సబ్ కమిటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించనున్నారు.  మంత్రులు కేటీఆర్​, హరీశ్​ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులుగా ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. స్కూల్స్ లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు – మన బడి’ప్రణాళిక కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మంగళవారం సీఎం వరంగల్ టూర్​

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్​ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

Also Read: కోవిడ్‌పై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం.. అధికారులకు ముఖ్య ఆదేశాలు

 ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ