Success Story: లక్షల్లో ఆదాయం వచ్చే ఉద్యోగాలు వదిలి రైతులుగా మారిన అన్నదమ్ములు.. డ్రాగన్ పంటతో లాభాలు పంట..

తమ సొంత ఊరులోనే ఏదైనా ప్రయోగాత్మకంగా అధిక లాభాలు వచ్చే పంటను సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకువెళ్లారు. నేడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ యువరైతులు ఏలూరి శివ శంకర్, సూర్య తేజ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Success Story: లక్షల్లో ఆదాయం వచ్చే ఉద్యోగాలు వదిలి రైతులుగా మారిన అన్నదమ్ములు.. డ్రాగన్ పంటతో లాభాలు పంట..
Dragon Fruit Farming

Edited By: Surya Kala

Updated on: Jul 15, 2023 | 2:10 PM

జాబ్ వదిలి.. వ్యవసాయం బాట పట్టారు అన్నదమ్ములు. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. మంచి ఉన్నతమైన ఉద్యోగం సాధించారు.  అయితే ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందలేకపోయారు, రైతుగా మారాలని నిర్ణయించుకున్నారు. తమ సొంత ఊరులోనే ఏదైనా ప్రయోగాత్మకంగా అధిక లాభాలు వచ్చే పంటను సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకువెళ్లారు. నేడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ యువరైతులు ఏలూరి శివ శంకర్, సూర్య తేజ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల తేజ అన్నదమ్ముళ్లు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వీరిద్దరు పూణే, బెంగళూరు పట్టణాల్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరికీ పలువురికి ఆదర్శంగా నిలవాలన్న కోరిక కలిగింది. తమకున్న వ్యవసాయ భూమిలో రైతుగా మారి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేద్దామని కుటుంబ సభ్యులతో చర్చించి, ఉద్యోగాలు వదిలి పెట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా పలు ఉద్యాన పంటల గురించి తెలుసుకున్నారు. వారికి ఉన్న ఆయిల్ పామ్ పంటలతో పాటు, ప్రస్తుత మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ పంటకు విలువ ఉండటంతో ఆ పంటను సాగు చేయా లని నిర్ణయించుకున్నారు.

డ్రాగన్ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. వియత్నాం దేశానికి చెందిన సీఎం రెడ్ అనే వంగడం మొక్కలు సేకరించి వారికున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో నాటారు. మొక్కల పెంపకానికి, మొక్కలు పాక డానికి సపోర్టుగా స్తంభాలు, ఇనుప తీగ, బిందు సేద్య పరికరాల కోసం ఎకరానికి రూ.6నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసినా ధైర్యం కోల్పోకుండా పెట్టుబడి పెట్టారు. మొదటి సంవత్సరంలోనే నెమ్మదిగా ఫలితాలు సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటిన మొదటి ఏడాది ఎకరంలో రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చిందనీ, రెండో ఏడాది రెండు టన్నులు, మూడో ఏడాది 5 టన్నుల దిగుబడి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..