Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..

|

Mar 08, 2023 | 11:37 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..
MLC Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా..

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో 9న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..