Telangana High Court: సింగరేణి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్

|

Dec 17, 2023 | 8:00 AM

సింగరేణి ఎన్నికల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌. ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. కారణం మీరంటే మీరని కార్మిక సంఘాల మధ్య ఫైట్‌ పీక్స్‌ చేరింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం పీక్స్‌ చేరిన టైమ్‌లో మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఈనెల 27న పోలింగ్‌ జరగాల్సి వుంది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Telangana High Court: సింగరేణి ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్
Singareni Elections
Follow us on

సింగరేణి ఎన్నికల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌. ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. కారణం మీరంటే మీరని కార్మిక సంఘాల మధ్య ఫైట్‌ పీక్స్‌ చేరింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం పీక్స్‌ చేరిన టైమ్‌లో మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఈనెల 27న పోలింగ్‌ జరగాల్సి వుంది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యలో పోలింగ్‌ ఏర్పాట్లు, సిబ్బంది నియామకానికి మరింత గడువు కావాలని కోరింది.పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు..తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

పిటిషన్‌ వెనుక ఎన్ఐటీయూసీ (NITUC) రాజకీయం వుందని ఆరోపించింది ఏఐటీయూసీ (AITUC). అయితే చేసిందంతా చేసి తమను బద్నాం చేస్తున్నారని ఎన్ఐటీయూసీ (NITUC) నేతలు ఏఐటీయూసీపై ప్రత్యారోపణ చేశారు. ఇలా ఇరువురు నేతలు విమర్శించుకున్నారు. వీరి పరస్పర ఆరోపణలు ఎలా వున్నా తాజా పిటీషన్‌తో సింగరేణి ఎన్నికలపై మరోసారి నీలి నీడలు కుమ్ముకున్నాయి. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదంటే మళ్లీ వాయిదాలపర్వమేనా అనే చర్చ సింగరేణిలో జోరుగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో సింగరేణి ఎలక్షన్స్‌ ఈనెల 27కు వాయిదాపడ్డాయి. అంతా సిద్ధం అనుకున్నారు. ప్రచారం పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంతలోనే ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయాలంటూ మరో పిటిషన్‌ వేయడంతో వాట్‌ నెక్ట్స్‌ అనే చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..