Smart Grid Services: గ్రేటర్‌లో విద్యుత్‌ స్మార్ట్‌గ్రిడ్‌ సేవలు.. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా

Smart Grid Services: విద్యుత్‌ వాడకంలోనూ స్మార్ట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్‌ సేవలన్నీ ఫోన్‌ ద్వారానే అందుకునే అవకాశం ఉంది. గ్రేటర్‌ ...

Smart Grid Services: గ్రేటర్‌లో విద్యుత్‌ స్మార్ట్‌గ్రిడ్‌ సేవలు.. విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2021 | 5:32 AM

Smart Grid Services: విద్యుత్‌ వాడకంలోనూ స్మార్ట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్‌ సేవలన్నీ ఫోన్‌ ద్వారానే అందుకునే అవకాశం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇందుకు ప్రయోగాత్మకంగా టీఎస్‌స్పీడీసీఎల్‌ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఫీడర్‌ పరిధిలోని సుమారు 8800లకు పైగా గృహ వినియోగదారుల కనెక్షన్లకు సింగిల్‌ఫేజ్‌ స్మార్ట్‌ మీటర్లను దశల వారీగా బిగించనున్నారు. ఇందుకు రూ.41 కోట్లను 50 శాతం గ్రాంట్‌ కింద కేటాయించారు. జీడిమెట్ల ఏరియాలో 11కేవీ ఫీడర్లు 44 వరకు ఉండగా, వాటన్నింటిని ఆటోమేషన్‌ కోసం ఆటో రైక్లోజర్లు, సెక్షనైజర్లు,రింగ్‌ మెయిన్‌ యూనిట్లు, ఫాల్ట్‌ పాసేజ్‌ ఇండికేటర్లను ఏర్పాటు చేశారు.

స్మార్ట్‌ గ్రిడ్‌కు ఈసీఐఎల్‌ టెక్నాలజీ సాయం చేయగా కేంద్ర ఇంధనశాఖ ఆర్థిక సాయం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో స్మార్ట్‌గ్రిడ్‌ పైలెట్‌ ప్రాజెక్టు పనితీరును పర్యవేక్షిస్తోంది. ఇలా కొన్ని నెలల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి ఏర్పాటుతో విద్యుత్‌ చౌర్యానికి చెక్‌ పడనుంది. విద్యుత్‌ సరఫరా కోసం ప్రధాన లైన్ల నుంచి 11కేవీ సబ్‌స్టేషన్‌లకు అనుసంధానమైన తర్వాత ఇంటింటికీ విద్యుత్‌ సరఫరా అవుతుంది.

ఒక లైను రెండు, మూడు విభాగాలుగా విభజిస్తారు. ఆ లైన్‌లో ఏదైనా భాగం దెబ్బతింటే కేవలం అంత వరకే కరెంటు సరఫరా నిలిచిపోతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ లైనులో ఎక్కడ నష్టం జరిగిందో ఈ విధానం ద్వారా ఖచ్చితంగా తెలిసిపోతుంది.

కాగా, ప్రీ పెయిడ్‌ విధానంలో కరెంటు బిల్లులు ఫోన్‌ బిల్లు తరహాలో ఎస్సెమ్మెస్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లు జారీ చేయనున్నారు. అనుమతి పొందిన విద్యుత్‌ కంటే అధికంగా వినియోగిస్తే వినియోగదారుడు, డిస్కంకు సమాచారం వస్తుంది. వినియోగదారుడు లోడ్‌ క్యాటగిరీని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా స్మార్ట్‌ విద్యుత్‌ సేవలు అందుబాటులోకి రానుంది.

Smart Railway Services: ఏపీలో స్మార్ట్‌గా రైల్వే సేవలు.. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీసు మార్కెట్ల ఏర్పాటు