
అమ్మ అనే పిలుపు కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారో ఈ రోజుల్లో. ఏ దారీ లేనప్పుడు IVF సెంటర్లకే వెళ్తారు దంపతులు. అక్కడ ఒక్కో టెస్ట్ చేస్తుంటేనే ఆశలు పుట్టుకొచ్చేస్తాయి. ఎందుకీ టెస్టులు, దానికయ్యే వేలకు వేల ఖర్చును పట్టించుకోరసలు. త్వరలో అమ్మనాన్న అయిపోతున్నాం అనే ఆనందం మాత్రమే కనిపిస్తుంది వారిలో. కాని, ఆ టెస్టులన్నీ ఒట్టి హంబక్ మాత్రమే. కేవలం దంపతులను ఏమార్చడానికి చేసే ఉత్తుత్తి పరీక్షలంతే. టెస్టుల పేరుతో వేలకు వేలు గుంజి.. వేరే వాళ్ల కడుపులో పెరిగేది వాళ్ల బిడ్డే అని నమ్మించి.. ఎంత మందిని మోసం చేసిందో డాక్టర్ నమ్రత. బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ ఇండియా. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు ఆన్‌లైన్‌లో కనిపించే ట్యాగ్‌లైన్ ఇది. అసలు ఎవరిచ్చారు బెస్ట్ అనే బిరుదు. వాళ్లకు వాళ్లే బెస్ట్ అనే ముద్ర వేసుకుని, ఆన్‌లైన్‌లో ప్రచారం చేయించుకుని, పిల్లలు కలగాలని ఆరాటపడుతున్న వాళ్లను రప్పించుకుంటున్నారు. రాజస్తాన్ దంపతులు అలా వచ్చిన వాళ్లే. ఆన్‌లైన్‌లో డాక్టర్ నమ్రత బిల్డప్ చూసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వచ్చినవాళ్లే. బట్… నమ్రత హిస్టరీకి మరో షేడ్ కూడా ఉంది. ఎన్నెన్ని కంప్లైంట్లు, కేసులు, అరాచకాలో గతంలో. దాదాపు 15 ఏళ్లుగా చేస్తున్న మోసాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మోసపోయిన దంపతులు కంప్లైంట్ చేయడం, అవి అరెస్టుల వరకు వెళ్లడం, జైలుకెళ్లి రావడం. షరా మామూలే నమ్రతకి. తన పలుకుబడిని...