Rohith Reddy: విచారణకు హాజరు కావాల్సిందే.. రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ.. వాట్ నెక్స్ట్..

తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ (సోమవారం) ఈడీ విచారణకు..

Rohith Reddy: విచారణకు హాజరు కావాల్సిందే.. రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ.. వాట్ నెక్స్ట్..
Rohit Reddy

Updated on: Dec 19, 2022 | 1:18 PM

తెలంగాణ రాజకీయాల్లో కర్ణాటక డ్రగ్స్‌ కేసు కలకలం రేపింది. పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ (సోమవారం) ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో రోహిత్ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరుకానంటూ లేఖలో పేర్కొన్నారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈనెల 31 వరకు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖ రాశారు. అయితే.. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇవాళే ఈడీ విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఈడీ ఎదుట రోహిత్ హాజరవుతారా.. లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు.. ఇవాళ ఉదయాన్నే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈడీ నోటీసులు, న్యాయ సలహాలు, తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. రోహిత్‌రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి క్వశ్చన్‌ చేస్తారా..? వ్యాపార లావాదేవీలపైన కూడా ప్రశ్నిస్తారా..? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి.. కేసీఆర్ ను కలవడం.. ఈడీకి విచారణకు హాజరుకాలేనంటూ లేఖ రాయడం, ఈడీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..