EC Green Signal to PRC : ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్, పీఆర్సీ అనౌన్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ

|

Mar 21, 2021 | 4:41 PM

EC Green Signal to PRC : తెలంగాణలో ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్‌ అందింది..

EC Green Signal to PRC : ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్, పీఆర్సీ అనౌన్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ
Prc Ec
Follow us on

EC Green Signal to PRC : తెలంగాణలో ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్‌ అందింది. పీఆర్సీ ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై EC అనుమతి కోరింది తెలంగాణ ఆర్థిక శాఖ. దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే, ఎన్నికల్లో ఈ అంశంపై లబ్ది పొందే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని సూచించింది. దీంతో ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ తగిలేందుకు ఎంతో సమయం పట్టదన్నమాట.

కాగా, గురువారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై ప్రకటన చేస్తా.. అని కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ఉద్యోగుల అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తారా లేదా పీఆర్సీ పై మాత్రమే ప్రకటన చేస్తారా అనేది సర్కారీ వేతన జీవుల్లో సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పీఆర్సీ తో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు, మరో 50వేల ఉద్యోగాల భర్తీపై కూడా ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాల నేతల్లో చర్చ జరుగుతోంది.

Read also : Param Bir Singh Vs Anil Deshmukh : నెలకు 100 కోట్లు వచ్చి పడాలనేది హోంమంత్రి మౌఖిక ఆదేశాల్లోని సారాంశమట.!