Khammam: రెస్టారెంట్‌ ఫుడ్‌ అని లొట్టలేసుకొని తింటున్నారా.? ఓసారి ఆలోచించండి..

మూడు రోజుల్లో సరి చేసుకోవాలనీ .. లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ కి చెందిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఖమ్మంలోని హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి, ఖమ్మం బైపాస్ రోడ్డులోని హోటళ్ల లో వంటశాలలో అపరిశుభ్రత, దుర్వాసన రావడం కనిపించింది, వంటల్లో ఉపయోగించే ఆహార పదార్థాలు కొన్ని కాలం చెల్లి నవి కనిపించగా..

Khammam: రెస్టారెంట్‌ ఫుడ్‌ అని లొట్టలేసుకొని తింటున్నారా.? ఓసారి ఆలోచించండి..
Restaurant Food
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: May 28, 2024 | 7:56 PM

పేరుకు పెద్ద రెస్టారెంట్స్‌, రకరకాల పేర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్‌ డిజైన్స్‌తో ఆకట్టుకుంటారు. కానీ లోపల అందించే ఆహారం నాణ్యత గురించి తెలిస్తే మాత్రం భయపడాల్సిందే. ఇటీవల కొన్ని రెస్టారెంట్ల బాగోతం చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా ఖమ్మం,భద్రాచలంలో పలు రెస్టారెంట్స్ లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రెస్ట్ ఇన్ , హవేలీ, శ్రీ శ్రీ,గౌతమి స్పైసి , శ్రీ భద్ర గ్రాండ్ టౌన్ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించగా.. హెటల్స్‌లో నిల్వ ఉంచిన చికెన్, నాసిరకం కారం, పసుపు, కొబ్బరి పొడిని అధికారులు గుర్తించారు. హోటల్స్ సీజ్ చేస్తానని హోటల్ యాజమాన్యాన్ని అసిస్టెంట్ ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి హెచ్చరించారు. రెస్ట్ ఇన్ హోటల్‌లో వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన చికెన్ కబాబ్‌లను కాల్వలో వేయించారు ఫుడ్‌ కంట్రోలర్‌ జ్యోతిర్మయి. కాలం చెల్లిన మసాలాలు ,కొబ్బరి పొడి, కిచెన్‌ అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

మూడు రోజుల్లో సరి చేసుకోవాలనీ .. లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ కి చెందిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఖమ్మంలోని హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి, ఖమ్మం బైపాస్ రోడ్డులోని హోటళ్ల లో వంటశాలలో అపరిశుభ్రత, దుర్వాసన రావడం కనిపించింది, వంటల్లో ఉపయోగించే ఆహార పదార్థాలు కొన్ని కాలం చెల్లి నవి కనిపించగా ..మరికొన్ని ప్రమాణాలు లేని మసాలా పొడులను వంటలలో ఉపయోగించడాన్ని గుర్తించారు అధికారులు.

Khammam

మూడు ప్రధానమైన హోటల్లో ఫ్రిడ్జ్ లను తెరిచి చూడగా నిలువ ఉంచిన మాంసం కనిపించడంతో వాటిని డ్రైనేజీలలో పారబోయించారు, ఈ తనిఖీల సందర్భంగా మూడు ప్రధాన హోటల్స్ లోని ఆహార పదార్థాలను, ఆహార దినుసులను శాంపిల్స్ సేకరించి తనిఖీల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని లేకపోతే హోటళ్లను సీజ్ చేస్తామని తనిఖీల సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశాయి. జిల్లా పుడ్ సేఫ్టి అధికారులు మామూళ్ల కు అలవాటు పడి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటల్స్, రెస్తా రెంట్స్ లో తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హైదారాబాద్ నుంచి పుడ్ కంట్రోలర్, టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి తనిఖీలు చేసి..నోటీసులు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!