Drink and Drive: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా? మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!

Drink and Drive: హైదరాబాద్‌లో వాహనాలు నడిపి ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి రోజు డ్రంక్‌అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడిన వారి వాహన లైసెన్స్‌లను సైతం రద్దు చేస్తున్నారు. ఇది వరకు పెనాల్టీతో పాటు కేసులు నమోదు చేయగా, ఇప్పుడు ఏకంగా కేసులతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు..

Drink and Drive: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా? మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
Follow us
Sridhar Rao

| Edited By: Subhash Goud

Updated on: Dec 17, 2024 | 7:41 PM

మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. పొరపాటున పోలీసులకు పట్టుబడితే మీ లైసెన్స్ రద్దు అయినట్టే.. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రమాదాలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ అధికారులు.. వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే చలానా వేసి వదిలేసే వారు. కానీ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు.

నాలుగున్నర ఏళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 48 వేల లైసెన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. వీటిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పాటు, ప్రమాదాలలో మరణాలకు కారణమైన వారి లైసెన్సులను కూడా రద్దు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే వారి విషయంలో రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తోంది. నాలుగున్నరేళ్లలో 48 వేలకు పైగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సు లను రద్దు చేసింది. వీరిలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారే ఎక్కువగా ఉన్నారు.

గత నాలుగు సంవత్సరాల్లో నాలుగు నుంచి ఆరు రెట్లు అధికంగా డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2022-23లో అత్యధికంగా 18 వేలకు పైగా, 2023-24లో 12 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెన్షన్‌లో పెట్టినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవంబరు 30 వరకు 5 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే అత్యధిక డ్రైవింగ్ లైసెన్స్ ల సస్పెన్షన్ ఉంటోంది. తరువాతి స్థానం మేడ్చల్ మల్కాజిగిరి కాగా.. మూడో స్థానం రంగారెడ్డి జిల్లా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ కారణంగా సస్పెండ్ చేస్తున్న లైసెన్సుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనివే ఉంటాయని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!