క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే.. వీరికి మాత్రమే విషంతో సమానం.. 

17 December 2024

Pic credit - Social Media

TV9 Telugu

శీతాకాలంలో క్యారెట్ సూపర్ ఫుడ్. ఇది ఫైబర్ గొప్ప మూకం. రక్తాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవారు క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయల రసాలను తాగాలి.

క్యారెట్ ఒక సూపర్ ఫుడ్

క్యారెట్లు ఆరోగ్యానికి ఒక వరం కావచ్చు. అయితే కొందరు దీనిని తినకూడదని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. ఎవరు క్యారెట్‌ను తినొద్దు.. లేదా దాని జ్యూస్‌ని తాగకూడదో తెలుసుకుందాం.. 

వీరు క్యారెట్లు తినవద్దు

ఎవరైనా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే క్యారెట్ తినకూడదని నిపుణులు చెప్పారు. ఎక్కువ ఫైబర్ క్యారెట్ లో ఉంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి

కడుపు నొప్పి విషయంలో

పొట్టకు పీచు ముఖ్యమే అయినా జీర్ణం కావాలంటే మంచి ఆరోగ్యం కూడా అవసరమని డాక్టర్ చెప్పారు. విరేచనాలు లేదా వాంతులతో ఇబ్బంది పడుతుంటే జీర్ణవ్యవస్థ బలహీనంగా మారుతుంది. జీర్ణం అవడం సులభం కాదు

జీర్ణవ్యవస్థ క్షీణించవచ్చు

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్ జ్యూస్ తయారు చేసి త్రాగే ముందు నిపుణులను సంప్రదించాలి. ఇది సహజ చక్కెరను కలిగి ఉన్నందున.. చక్కెర స్థాయిల్లో మార్పులు రావచ్చు. 

మధుమేహ రోగులు

ఆరోగ్యం అంటూ క్యారెట్లను ఎక్కువగా తీసుకుంటారు. పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకంతో బాధపడేవారు ఒకటి లేదా రెండు క్యారెట్లను మాత్రమే తినాలి.

మలబద్దక సమస్య ఉంటే 

పాలిచ్చే తల్లులు కూడా క్యారెట్లను ఎక్కువగా తినకూడదు.. క్యారెట్లను ఎక్కువగా తింటే తల్లిపాల రుచి మారుతుందట. దీంతో తల్లిబిడ్డలకు సమస్యలు కూడా వస్తాయట. 

పాలిచ్చే తల్లులు