Medak: నర్సాపూర్‌లో వీధి కుక్కల స్వైరవివాహం.. చిన్నారికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..

Medak, July 15: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో తిరగలంటే ప్రజలు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు పంపాలంటే గజ గజ వణికిపోతున్నారు తల్లిదండ్రులు. తాజాగా శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వీధికి చెందిన సురేష్..

Medak: నర్సాపూర్‌లో వీధి కుక్కల స్వైరవివాహం.. చిన్నారికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..
Dogs

Edited By: Shiva Prajapati

Updated on: Jul 15, 2023 | 4:03 PM

Medak, July 15: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో తిరగలంటే ప్రజలు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు పంపాలంటే గజ గజ వణికిపోతున్నారు తల్లిదండ్రులు. తాజాగా శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వీధికి చెందిన సురేష్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఏదో పని పైన సురేష్ తల్లిదండ్రులు ఆ బాలున్ని బయటకు పంపగా వీధి కుక్కలు దాడి చేసాయి. దీంతో ఆ బాలుడ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుణ్ణి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి, కుక్క కాటుకు సంబంధించిన మెడిసిన్ లేనందున నల్లకుంటకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. గత రెండు నెలల క్రితం కూడా ఇదే శివాలయం వీధిలో ఓ చిన్నారి షాప్ కోసం వెళ్లగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పాపపై దాడి చేసి తలపై కొరకడంతో పెద్ద గాయం అయ్యింది. వెంటనే అక్కడ ఉన్నవారు స్పందించి వాటిని తరమికొట్టడంతో ఆ పాపకు ప్రాణాపాయం తప్పింది. ఆ పాపను హైదరాబాద్ తరలించి చికిత్స చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల పై కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నర్సపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..