Telangana: సెప్టెంబర్ 2 నుంచి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ.. కలెక్టర్లకు మంత్రి తలసాని ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వప్రతిష్ఠాత్మకంగా డబులు బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హరీశ్, అమోయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ హౌజింగ్ ఓఎస్డీ సురేశ్‌లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబులు బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హరీశ్, అమోయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ హౌజింగ్ ఓఎస్డీ సురేశ్‌లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక వచ్చే నెల 2 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 8 ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు పడక గది ఇండ్లను పంపిణీ చేయనున్నామని.. ఇందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 2వ తేదీ నుండి GHMC పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం.
డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని చాంబర్ లో GHMC కమిషనర్, కలెక్టర్ ల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
మొదటి విడతలో 8 ప్రాంతాలలో 12 వేల మంది… pic.twitter.com/kL1W0LMWOy
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 19, 2023
ఇక మరో విషయం ఏంటంటే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ విషయంలో పారదర్శకతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఇండ్ల పంపిణీలో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఆగస్టు 24వ తేదిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండోమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తామని మంత్రి తలసాని శ్రీనియాదవ్ అన్నారు. అయితే సాఫ్ట్‌వేర్ ద్వారానే డ్రా పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అయితే మొదటి విడతలో భాగంగా దాదాపు 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆలోచనతో పేద ప్రజల సొంతింటి కలను నేరవేరుస్తూ తన ఉదారత్వాన్ని చాటుకుంటున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, వాటర్ సహా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తోందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..