AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలికి ఆహ్వానం.. ఆ హామీని నెరవేర్చనున్న రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం పెట్టనున్నారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే.. రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.

Revanth Reddy: సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలికి ఆహ్వానం.. ఆ హామీని నెరవేర్చనున్న రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 06, 2023 | 3:11 PM

Share

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం పెట్టనున్నారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే.. రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దివ్యాంగురాలికి ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తనకు ఆహ్వానం లభించడంపై దివ్యాంగురాలు రజినీ సంతోషం వ్యక్తంచేసింది.

వివరాల్లోకెళితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత అక్టోబర్ 17న హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డిని కలిసింది. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. తనకు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రజినీ తన ఆవేదనను రేవంత్ రెడ్డికి చెప్పింది.. ఆమె బాధ విన్న తరువాత రేవంత్ రజనీకి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డును కూడా అందజేశారు.

వీడియో చూడండి..

ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి వికలాంగురాలు రజినీకి తొలి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు రేవంత్ ప్రత్యేకంగా రజినీకి ఆహ్వానం పంపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..