CM KCR: ధరణి విజయవంతమైంది.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘భూ’ డిజిటల్ సర్వే : సీఎం కేసీఆర్

|

Feb 19, 2021 | 1:59 AM

Lands Digital Survey in Telangana: తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభమవుతుందని కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే పూర్తయిన వెంటనే స్పష్టత వస్తుందని..

CM KCR: ధరణి విజయవంతమైంది.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘భూ’ డిజిటల్ సర్వే : సీఎం కేసీఆర్
Follow us on

Lands Digital Survey in Telangana: తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభమవుతుందని కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే పూర్తయిన వెంటనే స్పష్టత వస్తుందని అనంతరం వ్యవసాయ భూములకు హద్దులు ఇస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లను పిలవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌, రెవెన్యూ సంస్కరణలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ నూటికి నూరుపాళ్లు విజయవంతమయిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖ పేరు కూడా మార్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు.

అయితే.. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలుందని సీఎం స్పష్టం చేశారు. పకడ్బందీ విధానం వల్ల ధరణిలో అక్రమ మార్పులకు తావులేకుండా పోయిందన్నారు. అనేక సంస్కరణలతో రెవెన్యూ శాఖలో మార్పులు తీసుకొచ్చామని.. ఇది కొందరికి మింగుడు పడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి వల్ల అనేక అంశాల్లో పరిష్కారం లభించిందని, మిగిలిన కొద్ది సమస్యలు కూడా డిజిటల్‌ సర్వేతో అన్ని భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏవైనా సమస్యలుంటే రైతులు ఇకపై జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read:

Advocates Murder: న్యాయవాది దంపతుల హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. కీలక విషయాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ సమర్పించిన సీఎం కేసీఆర్‌.. ముస్లింలకు శుభాకాంక్షలకు తెలిపిన ముఖ్యమంత్రి