Telangana: మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వగా భూమిలోంచి వింత శబ్ధాలు.. అంతలోనే పొగలు..

|

Jul 15, 2023 | 6:29 PM

వర్షాకాలం వచ్చిందంటే రైతులతో పాటు.. కొందరు ప్రజలు కూడా తమ వంతు మొక్కలు నాటి కూరగాయల మొక్కలు సహా వివిధ మొక్కలను పెంచుతారు. తాజాగా ఓ వ్యక్తి కూడా తన ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలు పెట్టాలని నిర్ణయించాడు. అయితే, మొక్కల కోసం తవ్విన గుంటలు, ఆ వ్యక్తితో పాటు

Telangana: మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వగా భూమిలోంచి వింత శబ్ధాలు.. అంతలోనే పొగలు..
Gas From Land
Follow us on

వర్షాకాలం వచ్చిందంటే రైతులతో పాటు.. కొందరు ప్రజలు కూడా తమ వంతు మొక్కలు నాటి కూరగాయల మొక్కలు సహా వివిధ మొక్కలను పెంచుతారు. తాజాగా ఓ వ్యక్తి కూడా తన ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలు పెట్టాలని నిర్ణయించాడు. అయితే, మొక్కల కోసం తవ్విన గుంటలు, ఆ వ్యక్తితో పాటు స్థానికులందరినీ భయాందోళనకు గురి చేసింది. గుంత తవ్వితే భూమిలోంచి చిత్రవిచిత్రమైన శబ్ధాలు వినిపించాయి. అంతేకాదండోయ్.. ఒక రకమైన గ్యాస్ కూడా బయటకు వచ్చింది. అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ ఘటన కొమురంభీం జిల్లా వాంకిడి మండలం శిరిడి గ్రామంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సురేష్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాడు. అయితే, ఆ కొద్దిపాటి గుంతలోంచే వింత శబ్ధాలు వినిపించాయి. అంతేకాదు, ఒక రకమైన రంగులో పొగలు వచ్చాయి. దాంతో సురేష్, అతని కుటుంబ సభ్యులు సహా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అసలేం జరిగుంతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. భూమిలోంచి గ్యాస్ వాసన రావడం, శబ్ధాలు రావడంపై అధికారులకు సమాచారం అందించారు. అధికారులు దీనికి కారణంపై ఆన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..