BRS Party: ఉదయం ఆలింగనం.. మధ్యాహ్నం షాక్.. ఇప్పుడా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో మరి..!

|

Apr 23, 2023 | 6:11 AM

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ కారు పార్టీలో టికెట్ల లొల్లి ముదురుతోందా?.. ఎమ్మెల్యే రేఖానాయక్‌, బీఆర్ఎస్‌ నేత జాన్సస్‌నాయక్‌ మధ్య కోల్డ్‌ వార్‌ హీట్‌ పెంచుతోందా?.. ఇద్దరి పోటాపోటీ కామెంట్స్‌కు రంజాన్‌ పండుగ వేదికైందా?.. ఇంతకీ.. ఖానాపూర్‌ కారు పార్టీలో రంజాన్‌ రోజు ఏం జరిగింది?.. బీఆర్ఎస్‌ నేతలు చేసిన కామెంట్స్‌ ఏంటి? వివరాలు ఇప్పుడు చూద్దాం.

BRS Party: ఉదయం ఆలింగనం.. మధ్యాహ్నం షాక్.. ఇప్పుడా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో మరి..!
Brs Party
Follow us on

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌ కారు పార్టీలో టికెట్ల లొల్లి ముదురుతోందా?.. ఎమ్మెల్యే రేఖానాయక్‌, బీఆర్ఎస్‌ నేత జాన్సస్‌నాయక్‌ మధ్య కోల్డ్‌ వార్‌ హీట్‌ పెంచుతోందా?.. ఇద్దరి పోటాపోటీ కామెంట్స్‌కు రంజాన్‌ పండుగ వేదికైందా?.. ఇంతకీ.. ఖానాపూర్‌ కారు పార్టీలో రంజాన్‌ రోజు ఏం జరిగింది?.. బీఆర్ఎస్‌ నేతలు చేసిన కామెంట్స్‌ ఏంటి? వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎమ్మెల్యే రేఖానాయక్‌కి సొంత పార్టీ నుంచే షాకులు తగులుతున్నాయి. ఖానాపూర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ నేతలు రెండుగా చీలిపోవడమే ఇందుకు కారణం. రేఖానాయక్‌కి పోటీగా బీఆర్‌ఎస్‌ నేత జాన్సన్‌ నాయక్‌ సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తనకంటూ కేడర్‌ని బిల్డ్‌ చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యా కోల్డ్‌ వార్ ఎప్పటినుంచో నడుస్తోంది. రంజాన్‌ సందర్భంగా.. ఓ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలూ ఎదురుపడ్డారు. జాన్సన్‌ నాయక్‌.. ఎమ్మెల్యే రేఖని చూసి చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఇద్దరూ నవ్వుతూనే కనిపించారు. ఆసమయంలోనే రేఖానాయక్‌ ఓ కామెంట్‌ పాస్‌ చేశారు. జాన్సన్‌ని ఉద్దేశిస్తూ.. ఈసారి తనకే టికెట్‌ దక్కుతుందని తేల్చి చెప్పారు. జాన్సన్‌ తన గెలుపు కోసం పనిచేస్తారని.. ఆయన ఇంకెక్కడైనా చూసుకుంటారంటూ చురకలంటించారు.

ఇవి కూడా చదవండి

రేఖానాయక్‌ మాట్లాడే సమయంలో జాన్సన్‌ పెద్దగా స్పందించలేదు. కాని.. మధ్యాహ్నం తర్వాత జాన్సన్‌ నోరు విప్పారు. తాను కూడా పోటీలోనే ఉన్నానంటూ ప్రకటించారు జాన్సన్‌. బీఆర్ఎస్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ లేదని.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ గెలవడానికి కష్టపడతానంటూ తానూ పోటీ చేస్తానని పరోక్షంగా కామెంట్‌ చేశారు. ఉదయం ఆలింగనం.. తర్వాత రేఖా నాయక్ మాట.. ఆ వెంటనే జాన్సన్‌ కౌంటర్స్‌తో ఖానాపూర్‌లో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..