Dharani Portal: కీలక మైలురాయిని దాటిన ధరణి పోర్టల్.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

|

Oct 28, 2021 | 8:03 PM

Dharani Portal: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక, భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను తీసువుకుచ్చి...

Dharani Portal: కీలక మైలురాయిని దాటిన ధరణి పోర్టల్.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

Dharani Portal: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక, భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను తీసువుకుచ్చి నేటికి ఏడాది పూర్తయ్యింది. గతేడాది అక్టోబర్ 29వ తేదీన ఈ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా.. నేటితో ఈ పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది.

రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఈ ధరణి. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. ధరణికి ముందు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మొదటి సంవత్సరంలోనే ధరణి సాధించిన ప్రగతి అంతాఇంతా కాదు. ఈ ఏడాదిలో ధరణి వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్‌లను సాధించగా, ధరణి ద్వారా దాదాపు 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. ఇంతకు ముందు పట్టాదార్‌ పాసుపుస్తకాలు ఇవ్వని దాదాపు 1,80,000 ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చారు. నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ఎప్పటికప్పుడు, స్టేక్ హోల్డర్ ల నుండి సలహాలు, సూచనలకు అనుగుణంగా సరికొత్త లావాదేవీల మాడ్యూల్స్ జోడించబడ్డాయి. వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా ప్రత్యేక మాడ్యూల్స్ పొందుపరచారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

కాగా, ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందాన్ని, అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో ధరణి పౌరుల సేవలో మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే.. ధరణిని విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లకు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ధరణి పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి.
ధరణి హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
ధరణిలో బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు, సమాచారం : 24,618

Also read:

Hyderabad: త్రీ డేస్‌ – త్రీ అటాక్స్.. అమ్మాయిలూ అలర్ట్..! హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు

Diwali 2021: SBI క్రెడిట్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. భారీ ఫెస్టివల్ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..

Catherine Tresa: కొత్త మెరుపులతో మెరిసిపోతున్న ‘కేథ‌రిన్ థ్రెసా’.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ ఫొటోస్…