Hyderabad: త్రీ డేస్‌ – త్రీ అటాక్స్.. అమ్మాయిలూ అలర్ట్..! హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు

అప్పుడెప్పుడో చూశామ్ వన్ సైడ్‌ లవ్ అటాక్స్. ప్రేమించ లేదనో... నో చెప్పిందో చంపేసిన ఉన్మాదుల్ని. వన్‌ సైడ్ లవ్ అటాక్స్ తగ్గాయనుకునేలోపే మృగాళ్లు చెలరేగిపోయారు.

Hyderabad: త్రీ డేస్‌ - త్రీ అటాక్స్.. అమ్మాయిలూ అలర్ట్..! హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు
Women dies
Follow us

|

Updated on: Oct 28, 2021 | 7:59 PM

అప్పుడెప్పుడో చూశామ్ వన్ సైడ్‌ లవ్ అటాక్స్. ప్రేమించలేదనో… నో చెప్పిందో చంపేసిన ఉన్మాదుల్ని. వన్‌ సైడ్ లవ్ అటాక్స్ తగ్గాయనుకునేలోపే మృగాళ్లు చెలరేగిపోయారు. ముక్కపచ్చలారని పసిపిల్ల దగ్గర్నుంచి పండు ముసలి అవ్వలపై అత్యాచారాలు, అఘాయిత్యాలతో తెగబడ్డారు. ఇవి తగ్గాయనుకునేలోపే మళ్లీ ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. వరుస అటాక్స్‌తో అమ్మాయిల ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రేమ-పెళ్లి పేరుతో గొంతు కోసి చంపేశాడు ఒకడు. ప్రేమించ లేదని ఏకంగా ఇల్లే తగలబెట్టేశాడు మరొకడు. వన్ సైడ్‌ లైవ్‌తో కత్తితో కసితీరా కోసేశాడు ఇంకొకడు. రోజుకో చోట, రోజుకో రకంగా… ప్రేమోన్మాదులు చెలరేగిపోతున్నారు. కాదన్న మాట వింటేచాలు కాటేసేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఉన్మాదుల్లా చెలరేగిపోతున్నారు. త్రీ డేస్‌లో త్రీ అటాక్స్. మొన్న చందానగర్… నిన్న జవహర్‌నగర్… నేడు గచ్చిబౌలి. కళ్లు మూసి తెరిచేలోపే అటాక్ చేసి చంపేస్తున్నారు.

సీరియల్ మర్డర్స్‌లాగా సీరియల్ అటాక్స్. మూడ్రోజుల్లో మూడుచోట్ల దాడులు. చందానగర్, జవహర్‌నగర్ తర్వాత నేడు గచ్చిబౌలిలో మూడో అటాక్‌. గచ్చిబౌలి వట్టినాగులపల్లిలో ప్రేమకు నో చెప్పిందని యువతి గొంతు కోసేశాడు ప్రేమోన్మాది. అర్ధరాత్రి దొంగలా ఇంట్లోకి దూరాడు. కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యేలోపే అమ్మాయి గదిలోకెళ్లి అటాక్ చేశాడు. అమ్మాయి నిద్ర మత్తులో ఉండగా కత్తితో గొంతు కోసేశాడు. ఐదే ఐదు నిమిషాలు ఆలస్యమైతే తన కూతురు ఆ ఉన్మాది చేతిలో బలైపోయి ఉండేదని తండ్రి చెబుతున్నాడు. బాధితురాలికి గొంతు, చేతి, కాలుకి కత్తి గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రేమ్‌సింగ్ జీడిమెట్లలో ఉంటాడని, డిగ్రీ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు.

అమ్మాయిలూ బహుపరాక్ అంటున్నారు పోలీసులు. వేధించినా, మోసగిస్తున్నా వెంటనే పోలీసులను అప్రోజ్ కావాలని సూచిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని చెబుతున్నారు. పోలీసులు చెప్పినట్టు అమ్మాయిలూ అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. చందానగర్ మర్డర్‌నే తీసుకుందాం… నిందితుడు కోటిరెడ్డితో కలిసి నాగచైతన్య ఎందుకు లాడ్జికి వెళ్లిందని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు. జవహర్‌నగర్ ఇన్సిడెంట్‌లోనూ వీక్ పాయింట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు గచ్చిబౌలి అటాక్‌లోనూ అనేక అనుమానాలు రేగుతున్నాయ్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎందుకు డోర్ తీసిందనే ప్రశ్న వస్తోంది. పైగా నిందితుడు ప్రేమ్‌సింగ్ తమ దూరపు బంధువే అంటూ బాధితురాలి సోదరులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్‌గా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే గచ్చిబౌలి అమ్మాయి ఆ ఉన్మాది చేతిలో బలైపోయేది. అందుకే, అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. అంతేకాదు, అమ్మాయిలూ మీరు మారాలని సూచిస్తున్నారు. వన్ సైడ్ లవ్, లవ్ ఫెయిల్యూర్స్‌లో ఇంతకుముందు ఎక్కువగా సూసైడ్స్ జరిగేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయ్. నో చెబితే చాలు అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ ఆన్‌లైన్‌లో పెట్టేసి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పోర్న్‌స్టార్‌గానో… కాల్‌ గర్ల్‌గానో మార్చేస్తున్నారు. షీ టీమ్స్‌, సైబర్ క్రైమ్‌కి వచ్చే కేసులన్నీ ఇవే.

హైదరాబాద్‌లో ఎందుకీ దారుణాలు జరుగుతున్నాయ్? యువకులు ఎందుకు ఉన్మాదుల్లా మారుతున్నారు? అమ్మాయిలు కూడా మారాల్సిన అవసరముందా? ఈ నెత్తుటి ప్రేమలు ఆగేదెలా? ఆపేదెలా?  అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Also Read:  మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్… ప్రతి గ్రామానికి ఉచితంగా ట్రాక్టర్‌..!

అప్పగింతల్లో ఏడవకుండా, ఫుల్ ఖుషీగా వధువు.. ఆమె చెప్పిన రీజన్ వింటే షాక్ తినాల్సిందే

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..