AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021: SBI క్రెడిట్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. భారీ ఫెస్టివల్ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..

SBI Credit Card Cashback offers: మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా?.. ఉంటే మీకో తీపికబురు. దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Diwali 2021: SBI క్రెడిట్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. భారీ ఫెస్టివల్ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..
Shopping
Janardhan Veluru
|

Updated on: Oct 28, 2021 | 7:35 PM

Share

SBI Credit Card Cashback offers: మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా?.. ఉంటే మీకో తీపికబురు. దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మెట్రో క్యాష్ & క్యారీలో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డును వాడుకుని షాపింగ్ చేస్తే ఈ ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే డీ మార్ట్‌లోనూ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు www.sbicard.com వెబ్‌సైట్‌‌కు లాగిన్ అవ్వాలి.

ఈ ప్రత్యేక రాయితీలకు సంబంధించి ఎస్బీఐ కార్డ్ ఇటీవల ఓ ట్వీట్ చేసింది. దీని ప్రకారం మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డును వాడుకుని షాపింగ్ చేస్తే రూ.400 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. కనిష్ఠంగా రూ.8వేలకు షాపింగ్ చేస్తే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఈఎంఐ ట్రాన్సక్షన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కార్పొరేట్ కార్డ్స్ ఎస్బీఐ పేటీఎం క్రెడిట్ కార్డ్స్ మినహా మిగిలిన ఎస్బీఐ క్రికెడ్ కార్డ్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 31 వరకు ఒక్కసారి షాపింగ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోండి bit.ly/3mgabSA

అలాగే డీ మార్ట్‌లో షాపింగ్ చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా మీరు చేసే చెల్లింపులపై కూడా గరిష్ఠంగా రూ.300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని ఎస్బీఐ కార్డ్ ట్విట్టర్‌లో తెలిపింది. నవంబరు 7వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.3,500కు పైగా చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కార్పొరేట్ కార్డ్స్, ఎస్బీఐ పేటీఎం క్రెడిట్ కార్డ్స్ మినహా మిగిలిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌కు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది.

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ www.sbicard.com కు లాగిన్ కావాలి.

Also Read..

Covid-19: అప్పటి వరకు ఆంక్షలు తప్పవు.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం..

Sabyasachi: యాడ్ తెచ్చిన తలపోటు.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందంటే..

Follow Us
ఈ 5 ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
ఈ 5 ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు