రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..

|

Jan 14, 2025 | 1:16 PM

తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన వారిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నవారున్నారు. పీఎం యశస్వి పథకం, గ్రామీణ అభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ, టెక్స్‌టైల్ హస్తకళల, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ద్వారా జీవితంలో సెటిల్ అయిన వారున్నట్లు తెలుస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న 15 మందితో కలిపి మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

రిపబ్లిక్ డే… ఢిల్లీకి అతిథులుగా.. తెలంగాణ మహిళలకు ఆహ్వానం..
Delhi Republic Day Celebrations
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు ఆహ్వానం అందింది. బెజ్జూరు మండలం కుకుడ గ్రామానికి చెందిన పోర్తెటి శ్రీదేవి, కౌటాల మండలం కౌటీ అంగన్‌వాడీ కార్యకర్త ఎస్. జయంతి రాణికి ఆహ్వానం అందింది. స్వర్ణిమ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీఎం యశశ్వి స్కీం టెక్స్‌టైల్ (హ్యాండీ క్రాఫ్ట్స్) డబ్ల్యూసీడీ హ్యాండీ క్ట్రాఫ్ట్స్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను కేటగిరిలో ఈ అవకాశం దక్కింది.

ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారిని కూడా ఆహ్వానించింది. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన వారిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నవారున్నారు. పీఎం యశస్వి పథకం, గ్రామీణ అభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ, టెక్స్‌టైల్ హస్తకళల, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ద్వారా జీవితంలో సెటిల్ అయిన వారున్నట్లు తెలుస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న 15 మందితో కలిపి మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..