Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.. గీత దాటితే వేటు తప్పదుః సీపీ అవినాష్ మహంతి

| Edited By: Balaraju Goud

Apr 16, 2024 | 8:01 PM

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేపడుతోంది పోలీస్ శాఖ. పోలింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి సమీక్షించారు.

Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.. గీత దాటితే వేటు తప్పదుః సీపీ అవినాష్ మహంతి
Cyberabad Police Commissioner Avinash Mohanty
Follow us on

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేపడుతోంది పోలీస్ శాఖ. పోలింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి సమీక్షించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జోనల్ డీసీపీలు, అదనపు డీసీపీ లు, ఏసీపీ, ఇతర అధికారులతో మీక్షా సమావేశం నిర్వహించారు సీపీ.

లోక్ సభ ఎన్నికలను పకద్భడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు. సైబరాబాద్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం ముఖ్యంగా ఉచితాలను పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.

ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలపై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్‌ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలను విధిగా పర్యటిస్తూ అట్టి ప్రాంతాలపై దృష్టిసారించాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…