Miyapur SI: మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు.. సమస్యపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళతోనే..

ఈ నగరానిక ఏమైంది అని సినిమా టైటిల్ కాస్త మార్చేసి ఈ నగర పోలీసులకు ఏమైంది అని సరిచేయాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకూ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. పంజాగుట్ట సీఐ దుర్గారావు. అతనిపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తాజాగా మియాపూర్ ఎస్సై గిరీష్ కుమార్‌ కూడా సస్పెండ్ అయ్యారు.

Miyapur SI: మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు.. సమస్యపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళతోనే..
Miyapur Si Girish Kumar
Follow us

|

Updated on: Dec 27, 2023 | 5:57 PM

ఈ నగరానిక ఏమైంది అని సినిమా టైటిల్ కాస్త మార్చేసి ఈ నగర పోలీసులకు ఏమైంది అని సరిచేయాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకూ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నించారు. పంజాగుట్ట సీఐ దుర్గారావు. అతనిపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తాజాగా మియాపూర్ ఎస్సై గిరీష్ కుమార్‌ కూడా సస్పెండ్ అయ్యారు. తనకు వచ్చిన సమస్యను పోలీసులతో విన్నవించుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ బాధితురాలితో సంబంధిత స్టేషన్ ఎస్సై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ అతడిని సస్పెండ్ చేశారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ సమాజాన్ని పరిరక్షించాల్సిన ఓ ఎస్సై దిగజారి నీచంగా ప్రవర్తించాడు. సమస్య ఉందని స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉన్న సమస్య కంటే కూడా ఎస్సై వేధింపులు తనకు మరింత ఇబ్బందికి గురిచేసింది. అమె ఫోన్ నెంబర్ తీసుకొని వేధింపులకు పాల్పడ్డాడు పోలీసు అధికారి. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్‌ కుమార్‌ మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల బ్యూటీషియన్‌గా పని చేస్తున్న ఓ మహిళ చీటింగ్‌ కేసు విషయమై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫ్రెండ్ బిజినెస్ పేరుతో సుమారు రూ.6 లక్షలు మోసం చేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కంప్లైంట్‌ను పరిశీలించిన ఎస్సై.. సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు. అనంతరం అతని వద్ద నుంచి డబ్బు రికవరీ చేయించారు. దీంతో ఈ కేసు తతంగం ముగిసిపోయింది. బాధితురాలికి న్యాయం జరిగిందని భావించింది. అయితే ఈ కేసు ముగిసిన తరువాత కూడా ఎస్సై గిరీష్ కుమార్ సదరు బ్యూటీషియన్ ఫోన్‌ నంబరు తీసుకుని వెంటపడ్డాడు. వాట్సాప్‌కు మెసేజ్‌లు పంపిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేశారు. సీపీ విచారణకు ఆదేశించగా.. వేధింపులు నిజమని తేలటంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసే తెలంగాణ పోలీస్‎కు.. ఇలాంటి కీచక పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే పెద్ద కళంకం ఏర్పడుతోంది. ఇలాంటి వారిని ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని కొందరు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..