Telangana: లచ్చిందేవి కోట్లతో వచ్చింది.. ఆ మూడు అకౌంట్లలో డబ్బులే డబ్బులు.. కానీ చివరకు

ఆదిలాబాద్ లో ఆదివాసీ రైతుల‌ను అదృష్ట దేవత వరించింది. రైతుల రుణమాఫి కార్డుల్లోకి కోట్లల్లో డబ్బు వచ్చి పడింది. ఎలా వచ్చాయో తెలియదు.. ఎంత వచ్చాయో తెలియదు..

Telangana: లచ్చిందేవి కోట్లతో వచ్చింది.. ఆ మూడు అకౌంట్లలో డబ్బులే డబ్బులు.. కానీ చివరకు
Crores Of Rupees
Follow us

|

Updated on: Feb 21, 2022 | 9:42 PM

ఆదిలాబాద్ లో ఆదివాసీ రైతుల‌ను అదృష్ట దేవత వరించింది. రైతుల రుణమాఫి కార్డుల్లోకి కోట్లల్లో డబ్బు వచ్చి పడింది. ఎలా వచ్చాయో తెలియదు.. ఎంత వచ్చాయో తెలియదు.. కానీ లక్షలకు లక్షలు డబ్బులు డ్రా అవుతుండటంతో సర్కారే పైసల్ వేసిందేమోనన్న భ్రమలో ఉండిపోయారు ఓ ముగ్గురు రైతులు. లచ్చిందేవి కరుణించిందని అదే చేత్తో చేసిన అప్పులు తీర్చారు.. అందులో ఓ ఇద్దరు మంచి ఇండ్లు కట్టుకున్నారు.. మరో మహిళా రైతు.. ఓ ఏడు తులాల బంగారం కొనుగోలు చేసింది‌‌. ఇక మా కష్టాలు తీరాయని సంబురపడేలోగానే అసలు విషయం తెలిసి కంగుతిన్నారు వాళ్లంతా.

అసలు ఏం జరిగింది…

ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కు చెందిన ముగ్గురు ఆదివాసీ రైతుల కిషాన్ క్రెడిట్ కార్డుల నుండి కోటీ రూపాయలకు పైగా డ్రా అయ్యాయి. చిన్న సల్పలగూడకు చెందిన మడావి రాంబాయి ( 3.5 ఎకరాలు ) , కొడప భీంరావు ( 10 ఎకరాలు ), కొడప గంగాదేవి ( 5 ఎకరాల ) లకు టీజీబీ బ్యాంక్ రుణమాపి కింద ఇచ్చిన కిషాన్ క్రెడిట్ కార్డుల్లో కాసుల వర్షం కురిసిన తీరుగా డబ్బులు డ్రా అయ్యాయి. ఇదంతా మామిడిగూడ కస్టమర్ సర్వీస్ పాయింట్ కేంద్రంగా సాగింది. సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్న రమేష్ అనే వ్యక్తి ఆ ముగ్గురు రైతులకు చెందిన కిషాన్ కార్డులను ఉపయోగించి రోజుకు పది వేల చొప్పున 2021 డిసెంబర్ 24 నుండి జనవరి 15 వరకు రెండు లక్షల డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు. అయితే ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది.. లిమిట్ అయిపోయిన తరువాత కూడా ఆ కార్డుల నుండి డబ్బులు డ్రా అవడం చూసి షాక్ గురయ్యాడు సీఎస్పీ నిర్వహకుడు రమేష్. తన సర్వీస్ పాయింట్ నుండి మాత్రమే ఇలా జరుగుతుందా లేక వేరే ఇతర సెంటర్ల నుండి కూడా ఇలా జరుగుతుందా అనే అనుమానంలో భాగంగా గత డిసెంబర్ 24 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల కస్టమర్ సర్వీస్ పాయింట్ నుండి లక్ష యాబైవేలు డ్రా చేశాడు. డబ్బు ఆశ అంత ఈజీగా చావదు కదా అందుకే అక్కడితే ఆపకుండా ఏకంగా జిల్లాలోని 20 ఏటీఎం సెంటర్ల నుండి మూడు కార్డులను వినియోగించి 1 కోటి 28 లక్షల 70 వేలను డ్రా చేసాడు. ఇందులో నుండి ఆ ముగ్గురు రైతులకు 16 లక్షల 20 వేలు ముట్టజెప్పి మిగిలిన కోటీ 12 లక్షల 58 వేలను కాజేశాడు.

ఎలా వచ్చి జమ అయ్యాయో తెలియదు. కానీ లిమిట్ కు మించి డబ్బులు జమ అయ్యాయి. ఎకరానికి 40 వేల చొప్పున ఒక్కో రైతుకు రుణమాఫి కింద రెండు లక్షల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వచ్చే అవకాశం లేదు. కానీ అదృష్టవశాత్తు కోటీకి పైగా మూడు అకౌంట్ల నుండి డ్రా అవ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే మూడు నెలలుగా ఇంత వ్యవహారం సాగుతున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అదికారులు గుర్తించకపోవడం గమనార్హం.

టీజీబీ లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక

తాజాగా ఫిబ్రవరి 18 న సల్పలగూడకు చెందిన ముగ్గురు రైతుల ఖాతాల నుండి యదేచ్చగా డబ్బులు డ్రా అవుతున్నాయని గుర్తించిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అధికారులు ఆదిలాబాద్ బ్రాంచ్ ను అలర్ట్ చేశారు. అలర్ట్ అయిన ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ , బ్రాంచ్ మేనేజర్ వివేక్ ను విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా అదే రోజు రాత్రి ఆ ముగ్గురు రైతుల అకౌంట్లను , సీఎస్పీ సెంటర్ నిర్వహకుడు రమేష్ స్వైపింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ను నిలదీయడంతో జరిగిందంతా ఒప్పుకున్నాడు. మడావి రాంబాయి , కొడప భీంరావు , కొడప గంగాదేవికి చెందిన కిషాన్ క్రెడిట్ కార్డులను వాడి కోటీ 28 లక్షల 70 వేలు డ్రా చేశానని.. రైతులకు ఇవ్వకుండా తన వద్దే కోటి 12 లక్షలకు పైగా ఉంచుకున్నాను తెలిపాడు‌. దీంతో షాక్ అవడం బ్యాంక్ సిబ్బంది వంతైంది. అయితే ఇదంతా ఒక్క రోజు జరిగి‌న వ్యవహారం కాదని మూడు నెలలుగా విడతల వారిగా డబ్బులను కాజేశాడని తేలింది.

Bank Fraud Case: ఆదిలాబాద్‌ బ్యాంకు మోసం కేసులో కొత్త ట్విస్ట్‌.. రైతు ఖాతాలో రూ.60 కోట్లు..!

అయితే మూడు నెలలుగా ఇంత తతంగం జరిగినా బ్యాంక్ అదికారులు గుర్తించకపోవడం.. ప్రధాన కార్యాలయం నుండి ఉన్నతాదికారులు ఆదేశాలు ఇచ్చేంత వరకు అసలు ఏం జరిగిందో కూడా ఆదిలాబాద్ బ్రాంచ్ అదికారులకు తెలియకపోవడం గమనార్హం. సీన్ కట్ చేస్తే సీఎస్పీ నిర్వహకుడు రమేష్ చేసిన గణకార్యంతో ఆ ముగ్గురు రైతులు ఇరకాటంలో పడ్డారు. తమ ఖాతాల్లో పడ్డ డబ్బులు ప్రభుత్వమే వేసిందనుకున్నామని తెలిపారు ఆదివాసీ రైతులు. అదృష్టం వరించిందని లక్షల్లో డబ్బులు వచ్చాయని సంబరపడి అప్పులు కూడా తీర్చేశామని ఇప్పుడు ఉన్నపళంగా డబ్బులు కట్టమంటే మా వల్ల కాదని ఆందోళనకు దిగారు‌ రైతులు. చివరికి బ్యాంక్ అధికారులు‌ రైతులకు నచ్చ చెప్పడంతో మూడు నెలల్లో తిరిగిస్తామని ఒప్పంద పత్రం రాసిచ్చారు.

అంతా వాళ్లే చేశారా..?

అయితే ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉన్నట్టుగా అనుమానాలు‌ వ్యక్తమవుతున్నాయి. సీఎస్పీ పాయింట్ నిర్వాహకుడు మధ్యవర్తిగా ఉన్న ఐరిక్స్ సంస్థ కూడా మామిడిగూడ లాంటి మారుమూల గ్రామం నుండి కోట్లలో లావాదేవీలు జరుగుతుంటే గమనించకపోవడం విడ్డూరం. టీజీబీ అదికారులు సాంకేతిక సమస్యతోనే ఇదంతా జరిగిందని చెబుతున్నా అసలు మిస్టరీ మాత్రం తేలాల్సి ఉంది. ఈ వ్యవహరమంతా తెలిసి కూడా ఇటు బ్యాంక్ అదికారులకు అటు సర్వీస్ పాయింట్ ప్రొవైడర్ సంస్థ ఐరిక్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా సీఎస్పీ నిర్వహకుడు రమేష్ తమను మోసం చేశాడని.. మరో వైపు అమాయకులైన ఆదివాసీ రైతులను సైతం నమ్మించి కోటీకి పైగా డబ్బులు తన వద్దే దాచుకున్నాడని.. దీనిని పెద్ద మోసంగానే భావిస్తున్నామంటున్నారు టీజీబీ బ్యాంక్ అధికారులు. కోట్లల్లో డబ్బులు కిషాన్ క్రెడిట్ కార్డుల్లోకి ఎలా చేరాయో ఉన్నత స్థాయిలో విచారణ కొనసాగుతుందని త్వరలోనే అన్ని వివరాలు మీడియాకు వెళ్లడిస్తామని చెపుతున్నారు ఆదిలాబాద్ టీజీబీ ఆర్ఎం విజయ్ కుమార్. రాష్ట్రంలో ఉన్న 14 లక్షలకు పైగా ఉన్న కిషాన్ క్రెడిట్ కార్డుల్లో ఓ మారుమూల గ్రామంలో ఉన్న ఆదివాసీ రైతుల అకౌంట్లలోకే కోట్ల మనీ చేరడం ఇప్పటికే తేలని మిస్టరీ.

Also Read: Hyderabad: అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..