Telangana: కెనాల్‌లో అలికిడి శబ్దం.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు

వారంతా యధావిధిగా రోజు వారి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న కెనాల్‌లో అలికిడి శబ్దం వినిపించింది. ఇలాంటి శబ్దాలు మామూలేనని అనుకొని ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ కెనాల్‌లో శబ్దం పెద్దగా వినిపించింది. కెనాల్‌లోకి చూస్తే అందరూ షాక్. ఆ కెనాల్‌లో మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాలి.

Telangana: కెనాల్‌లో అలికిడి శబ్దం.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు
Trending

Edited By:

Updated on: Jan 19, 2026 | 12:58 PM

నల్లగొండ జిల్లా పెద్ద ఆడిశర్లపల్లి మండలం పుట్టంగండి గిరిజనులు రబీ సీజన్ వరి నాట్లు కావడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. అటుగా వెళుతున్న స్థానికులకు పక్కన ఉన్న కెనాల్లో అలికిడి శబ్దం వినిపించింది. కొందరి శబ్దాన్ని లైట్‌గా తీసుకున్నారు. పెద్దగా శబ్దం వినిపించడంతో గిరిజనులు కెనాల్‌లోకి చూశారు. అప్రోచ్ కెనాల్‌లో మొసలి కనిపించడం కలకలం రేపింది. మొసలిని చూసేందుకు పరిసర ప్రాంతాల్లోని గిరిజన తండాలకు చెందిన జనం ఎగబడ్డారు. అయితే మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక గిరిజనుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి వచ్చి మొసలిని పరిశీలించారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

హైదరాబాద్ జంట నగరాలు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును నిర్మించారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌ను ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు అప్రోచ్ కెనాల్ ద్వారా కృష్ణజలాలు పుట్టంగండి పంపు హౌస్‌కు వస్తాయి. ఇక్కడి నుంచి మోటార్ల ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వస్తాయి. అప్రోచ్ కెనాల్‌కు పుట్టంగండి పంప్ హౌస్‌కు మధ్య గేటు ఏర్పాటు చేయడంతో అప్రోచ్ కెనాల్‌లోనే మొసలి తిరుగుతూ కనిపించింది. ఈ మొసలి తిరిగి సాగర్ బ్యాక్ వాటర్‌లోకి వెళ్తుందని, అప్రోచ్ కెనాల్‌లోకి చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..