AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బురదలో కదులుతూ కనిపించిన జీవి.. ఏంటా అని రైతు చెక్ చేయగా..

వరదలతో అల్లాడి... పునరావాసాలకు వెళ్లి తిరిగివచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను మరికొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Telangana: బురదలో కదులుతూ కనిపించిన జీవి.. ఏంటా అని రైతు చెక్ చేయగా..
Representative image
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2022 | 11:48 AM

Share

Godavari Floods: భారీ వర్షాలతో గోదావరి తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా ఇప్పుడిప్పుడే గోదారమ్మ శాంతిస్తుంది. ఈ క్రమంలో పునరావాసాల నుంచి ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల బాధితులు ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వరదతోపాటు ఇళ్లలో, వాడల్లో పాములు, తేళ్లు, మొసళ్లు, ఇతర ప్రమాదకర జీవులు చేరి గజగజ వణికిస్తున్నాయి. ఇప్పటికే పాము, తేలు కాట్ల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) అశ్వాపురం మండలం నెల్లిపాక(nellipaka)లో పొలం పనులకు వెళ్లిన రైతులు కంగుతిన్నారు. బురదలో ఏదో తారసలాటడం చూశారు. దగ్గరికి వెళ్లగా అది మొసలి పిల్లగా నిర్ధారించారు. పొలంలోని బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న యానిమల్​రెస్క్యూ టీంకు  పంట పొలంలో ఉన్న మొసలిపిల్లను పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. వరదలకు అడవుల్లోని విషపురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Crocodile

వరద ప్రవాహంలో ఇలాంటి జీవులు కొట్టుకువచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు. వీటిని గుర్తిస్తే చంపకుండా.. తమకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు నల్లాలను శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రజలంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే నీటిని వాడుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..