Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్.. తెలంగాణలో ఒక వ్యాక్సిన్ ధర ఎంతంటే..?

|

Feb 26, 2021 | 1:44 PM

Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్.. తెలంగాణలో ఒక వ్యాక్సిన్ ధర ఎంతంటే..?
Covid-19 Vaccine
Follow us on

Covid Vaccine: ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ వర్గాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పలు సూచనలు, మార్గర్శకాలు రావడంతో అధికారులు ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా సప్లై చేసే కొవిడ్ వ్యాక్సిన్ ధర తెలంగాణలో రూ. 300 నుంచి రూ .500 మధ్య ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా, మార్చి 1 నుండి రాష్ట్రంలోని 236 ప్రైవేట్ ఆసుపత్రులలో ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి తదుపరి దశలో టీకా అందిస్తామని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ఇక ఈ 236 ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితాలో ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులేనని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌తో పాటు.. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయడం జరుగుతుందని చెప్పారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాకు సంబంధించి మీడియాతో మాట్లాడిన వైద్యాధికారి ఒకరు.. “ఎంపిక చేసిన ఆసుపత్రులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఏ రోగికి కూడా ఎక్కువ టీకాలు ఇవ్వొద్దని సూచనలు జారీ చేయడం జరిగింది’’ అని తెలిపారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్ నుంచి పంపిణీ చేస్తారా? లేదా నేరుగా కంపెనీల ద్వారా ఆసుపత్రులకు పంపిణీ చేస్తారా? అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అంతేకాదు.. ప్రైవేట్ ఆసుపత్రులలో టీకా కార్యక్రమాన్ని ఎవరు నియంత్రిస్తారనే దానిపైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు.

ఇదిలాఉంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,95,850 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also read:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జాబ్స్‌ ఫైట్‌.. గన్‌పార్క్‌ దగ్గర కుర్చీ వేసుకుని కాంగ్రెస్‌ వెయిటింగ్‌..