Khammam: ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా.. కోవిడ్ వైద్య సేవల అనుమతులు రద్దు

|

May 30, 2021 | 2:52 PM

Covid-19 Medical Services Permits Cancellation: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రారంభం నాటి నుంచి ఆసుపత్రిల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రైవేటు

Khammam: ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా.. కోవిడ్ వైద్య సేవల అనుమతులు రద్దు
Covid-19
Follow us on

Covid-19 Medical Services Permits Cancellation: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రారంభం నాటి నుంచి ఆసుపత్రిల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై పలు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల కరోనా పేరుతో లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి అధిక బిల్లులు వేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న జిల్లాలోని పది ప్రైవేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ మాలతి పది ఆసుపత్రులకు అనుమతులు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ పది ఆస్పత్రులు కూడా నిబంధనలు అతిక్రమించినట్లు టాస్క్‌ఫోర్స్‌ విచారణలో నిర్ధారణ కావడంతో డీఎంహెచ్‌వో ఈ మేరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అనుమతులు రద్దు చేసిన ఆస్పత్రుల వివరాలు..
విశ్వాస్ ఆసుపత్రి,
క్యూర్,
ప్రశాంతి,
మార్వెల్,
జనని,
ఇండస్,
విజయలక్ష్మి,
శ్రీబాలాజీ,
న్యూహోప్,
సంకల్ప ఆసుపత్రులకు కోవిడ్‌ వైద్య సేవల అనుమతులు రద్దు చేసినట్లు డీఎంహెచ్ఓ ప్రకటించారు.

Also Read:

ప్రధాని మోదీ ఓ ‘ఈవెంట్ మేనేజర్’…, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, … ‘మన్ కీ బాత్’ అర్థ రహితమని విమర్శ

Coronavirus: ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌… రక్తం విషపూరితం.. మృతి