Today Cotton Price: దూసుకుపోతున్న ‘తెల్ల బంగారం’.. రికార్డ్ బ్రేక్ చేస్తోన్న పత్తి ధర

|

Dec 31, 2021 | 8:27 AM

తెల్ల పసిడి పండిపోతోంది. ధర కొత్త కొత్త రికార్డ్స్‌ను సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా 9వేలను టచ్‌ చేసింది. వర్షాలతో దిగుబడి తక్కువగా వచ్చినా.. రేట్లతో రైతు మొఖంలో ఆనందం కనిపిస్తోంది.

Today Cotton Price: దూసుకుపోతున్న తెల్ల బంగారం.. రికార్డ్ బ్రేక్ చేస్తోన్న పత్తి ధర
Cotton
Follow us on

పత్తి ధర దూసుకుపోతుంది. పొలాల్లో పంట భారీగా పండకున్నా.. మార్కెట్‌లో ధర భారీగా పలుకుతుండటంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. పత్తి ధర ప్రజంట్ రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మద్దతు ధర కంటే అధికంగా ధర వస్తోంది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఉండటంతో ఒక్కసారిగా పెరిగిన ధరను చూసి రైతులు కూడా సంతోషిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకు పత్తి ధరలు పెరగడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చినా క్వింటాలుకు 4 వేల నుండి 5 వేల వరకు మాత్రమే ధర పలకడంతో చేసిన ఖర్చులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలు అయ్యారు. ఈ ఏడాది మాత్రం పత్తి పంటకు వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. అంతంత మాత్రమే వచ్చిన దిగుబడితో దిగాలుగా ఉన్న రైతన్నకు.. మార్కెట్‌లో ధరను చూసి సంతోష పడుతున్నాడు. ఈ సంవత్సరం ఎకరాకు 4 నుండి 5 క్వింటాళ్ల పత్తి దిగుబడి తగ్గినా క్వింటాలుకు 9వేల వరకు ధర పలకడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా పత్తి దిగుబడులు తగ్గి.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో పండించిన కొద్దిపాటి పత్తికి ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో క్వింటాలుకు 10 వేల వరకు చేరుతుందని వ్యాపార వర్గాలు తెలుపుతున్నారు.

కాగా గురువారం ఖమ్మం మార్కెట్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9,100 ధర పలుకగా, వరంగల్‌లో రూ.8,805 పలికింది. మార్కెట్లోకి పత్తి తీసుకురావడమే ఆలస్యం హాట్‌కేక్‌లా అమ్ముడుపోతుంది.

Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?