Corona Tests Update: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన వారు క్యూలైన్లో బారులు తీరుతున్నారు. భారీగా తరలివచ్చిన జనాలు తమ తమ చెప్పులను లైన్ లో పెట్టి ఎదురుచూస్తున్నారు.
భూపాలపల్లి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు ముప్పై మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడంతో ముందు క్యూ లైన్ లో ఉన్నవారికి మాత్రమే అవకాశం లభిస్తుంది. దీంతో టెస్టుల సంఖ్యను పెంచి ఇక్కడికి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒక్క వైద్యాధికారి కూడా పర్యటించడం లేదని ఆరోపించారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లు, వారి కుటుంబీకులకు ప్రాథమికంగా టెస్టులు చేయాల్సిన వైద్యాధికారులు.. ఆశావర్కర్లపై భారంపెట్టి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?
Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!