కరోనా వస్తే కచ్చితంగా ఐసోలేషన్ లో ఉండాలి. లేదంటే ఆ మహమ్మారి కుటుంబసభ్యులతో పాటు సన్నిహితంగా మెలిగేవారికి కూడా సోకే ప్రమాదం ఉంది. తాజాగా కరోనా బారిపడ్డ ఓ నిరుపేద యువకుడు ఐసోలేషన్ కోసం వినూత్న ఆలోచన చేశాడు. ఓ కానుగ చెట్టునే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆలోచన ఉండాలే గానీ ఎంతటి రోగాన్నైనా, ఎలాంటి సమస్యనైనా అలవోకగా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్ శివకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అసలే పేదరికం, ఆపై ఒకటే ఇళ్లు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా మార్చుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివ. ఏదైనా కుర్రాడి ఆలోచన అదుర్స్ కదా.. నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే ఇదేనేమో.
శివ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలోని పేదరికానికి ఈ చిత్రం అద్దం పడుతుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలానే ఉంటే..