కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో కరోనా కలవరం.. 67 మంది విద్యార్థులతో పాటు 8 మంది అధ్యాపకులకు పాజిటివ్

రాష్ట్రంలో కరోనా మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తుంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న వైరస్ ఒక్కసారిగా వ్యాప్తి చెందుతుంది. అటు జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో కరోనా కలవరం.. 67 మంది విద్యార్థులతో పాటు 8 మంది అధ్యాపకులకు పాజిటివ్
Follow us

|

Updated on: Nov 28, 2020 | 6:00 PM

రాష్ట్రంలో కరోనా మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తుంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న వైరస్ ఒక్కసారిగా వ్యాప్తి చెందుతుంది. అటు జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో 290 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 67 మంది విద్యార్థులతో పాటు 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం బుక్స్ తీసుకునేందుకు విద్యార్థులు నాలుగు రోజుల క్రితం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించడంతో కరోనా కేసుల బయటపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం చేయించాలని కోరుతున్నారు. కాగా, మరోసారి హాస్టల్ ను ఖాళీ చేయించిన అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు.