Telangana Corona Updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..

|

Jul 05, 2021 | 7:27 AM

Telangana Corona Updates: తెలంగాణలో రోజు వారీగా నమోవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన..

Telangana Corona Updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..
Corona
Follow us on

Telangana Corona Updates: తెలంగాణలో రోజు వారీగా నమోవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 605 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,26,690కి చేరింది. ఇదే సమయంలో కోలుకున్న వారి సంఖ్య 1,088గా నమోదవగా.. మొత్తంగా చూసుకుంటే వారి సంఖ్య 6,11,035 లకు చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కరోనా బాధిత మృతుల సంఖ్య 3,691 లకు చేరింది.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 11,964 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.50 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ఇక 24 గంటల్లో 71,088 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 1,90,66,401 శాంపిల్స్ పరీక్షించారు. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 107 కేసులు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ – 5
బద్రాద్రి కొత్తగూడెం – 25
జీహెచ్ఎంసీ – 107
జగిత్యాల – 19
జనగామ – 7
జయశంకర్ భూపాలపల్లి – 14
జోగులాంబ గద్వాల – 5
కామారెడ్డి – 1
కరీంనగర్ – 54
ఖమ్మం – 22
కొమరంభీం ఆసిఫాబాద్ – 0
మహబూబ్‌నగర్ – 10
మహబూబాబాద్ – 33
మంచిర్యాల – 19
మెదక్ – 5
మేడ్చల్ మల్కాజిగిరి – 27
ములుగు – 9
నాగర్ కర్నూల్ – 5
నల్లగొండ – 27
నారాయణ పేట – 3
నిర్మల్ – 0
నిజామాబాద్ – 6
పెద్దపల్లి – 21
రాజన్న సిరిసిల్ల – 24
రంగారెడ్డి – 33
సంగారెడ్డి – 7
సిద్దిపేట – 22
సూర్యాపేట – 36
వికారాబాద్ – 5
వనపర్తి – 1
వరంగల్ రూరల్ – 19
వరంగల్ అర్బన్ – 26
యాదాద్రి భువనగిరి – 8

Also read:

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

లోని పై కేసులో 11 మందిపై యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు

Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్.. వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..