లోని పై కేసులో 11 మందిపై యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు

లోని పై కేసులో 11 మందిపై  యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు
Up Police Files Chargesheet

యూపీలోని ఘజియాబాద్ లో అబ్దుల్ సమద్ లోని అనే వృద్దునిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు మొత్తం 11 మందిపై చార్జిషీట్ నమోదు చేశారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 04, 2021 | 9:39 PM

యూపీలోని ఘజియాబాద్ లో అబ్దుల్ సమద్ లోని అనే వృద్దునిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు మొత్తం 11 మందిపై చార్జిషీట్ నమోదు చేశారు. ట్విటర్ పై తిరిగి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 11 మందిలో ఇద్దరిపై గ్యాంగ్ స్టర్స్ చట్టం కింద కేసు పెట్టడం విశేషం. ఇతరులపై ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 24 మంది సాక్షులను విచారించినట్టు వారు చెప్పారు. లోనీపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ భద్రతా చట్టం కింద ఉమ్మెద్ పహిల్వాన్ అనే వ్యక్తిపై ఇదివరకే కేసు ఉన్నప్పటికీ అతడి పేరును ఈ చార్జిషీట్ లో చేర్చలేదన్నారు. అతనిమీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని ఖాకీలు పేర్కొన్నారు. ట్విటర్ పై ఘజియాబాద్ పోలీసులు ఇదివరకే కేసు పెట్టినా ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి వీరి ముందు హాజరు కాకుండా ఉండేందుకు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు కోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. ఈ సారి మళ్ళీ ఖాకీలు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

లోనీ కేసులో మతపరమైన ఘర్షణ జరిగిందనడానికి ఆస్కారం లేదని పోలీసులు అంటున్నారు. ఏమైనా ఇది తీవ్రమైన విషయమని… ముఖ్యంగా ఈ వీడియో వైరల్ కావడంతో రెండు వర్గాల మధ్య ఉద్రికత్త తలెత్తుతుందని భావించామని వారు చెప్పారు. 72 ఏళ్ళ వృద్దుడైన లోనీ పై ఎటాక్ జరిపినవారిలో అతనికి తెలిసినవారు కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.

 మరిన్ని ఇక్కడ చూడండి:  Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్.. వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..

జాగ్రత్త : ఆయా పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ వార్నింగ్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu