కలెక్టర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణపై ర్యాలీ

|

Oct 29, 2020 | 2:13 PM

ప్రకాశంజిల్లా ఒంగోలులో కరోనా నియంత్రణపై అవగాహనా ర్యాలీ చేపట్టారు. దసరా పండుగకు ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు రాకపోకలు సాగించిన నేపధ్యంతో పాటు, నవంబర్‌ 2వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డిఆర్‌డిఏ, వైయస్‌ఆర్‌కెపి మహిళా సంఘాలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. స్వయం రక్ష, మాస్కే కవచం వంటి […]

కలెక్టర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణపై ర్యాలీ
Follow us on

ప్రకాశంజిల్లా ఒంగోలులో కరోనా నియంత్రణపై అవగాహనా ర్యాలీ చేపట్టారు. దసరా పండుగకు ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు రాకపోకలు సాగించిన నేపధ్యంతో పాటు, నవంబర్‌ 2వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డిఆర్‌డిఏ, వైయస్‌ఆర్‌కెపి మహిళా సంఘాలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. స్వయం రక్ష, మాస్కే కవచం వంటి స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని, అయితే కేసులు తగ్గాయన్న భరోసాతో అజాగ్రత్తగా ఉంటే కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. స్కూళ్ళు కూడా ప్రారంభం కానున్న నేపధ్యంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్ధులకు కరోనా సోకినా పెద్దగా ప్రమాదం ఉండదని, వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. అయితే స్కూళ్ళకు వచ్చే విద్యార్దుల నుంచి కుటుంబ సభ్యులకు ఈ వ్యాధి సంక్రమించకుండా ఉండేందుకు కోవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం వల్ల కరోనాకు దూరంగా ఉండొచ్చని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.