Maoists: నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు.. ఏజెన్సీలో హై అలెర్ట్

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. వార్షికోత్సవాలు విజయవంతం చేయాలనీ కర్రపత్రాలు, లేఖలు విడుదల చేసింది. మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఏజెన్సీ అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఛత్తీస్‎గడ్‎కి వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ.. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Maoists: నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు.. ఏజెన్సీలో హై అలెర్ట్
Maoists

Edited By:

Updated on: Sep 21, 2023 | 4:48 PM

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. వార్షికోత్సవాలు విజయవంతం చేయాలనీ కర్రపత్రాలు, లేఖలు విడుదల చేసింది. మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఏజెన్సీ అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఛత్తీస్‎గడ్‎కి వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తూ.. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టుల లిస్టులో ఉన్న నేతల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని.. ఆదివాసీ గ్రామాల్లో పోలీసులు హెచ్చరిస్తున్నారు. చర్ల ,దుమ్ముగూడెం,భద్రాచలం నుంచి ఛత్తీస్‌గడ్ వెళ్ళే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. రాత్రి పూట తిరిగే ఆర్టీసి బస్సులను రద్దు చేశారు..

మరోవైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు,కర పత్రాలు వెలిశాయి. దుమ్ముగూడెం మండలంలో పలు గ్రామాల్లో ఆదివాసీ సంఘాల పేరుతో కర పత్రాలు బయటపడ్డాయి. మావోయిస్టుల వల్ల ఆదివాసీల బ్రతుకులు ఏమి మారాయి.. ఆదివాసులకు ఒరిగిందేమిటి..? మావోయిస్టుల వల్ల ఆదివాసీలు సరైన ఉపాధి,విద్య,వైద్యం లేక నష్టపోతున్నారంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. అడవుల్లో బాంబులు అమర్చి పశువులు ,మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. మమ్మల్ని బలవంతంగా బెదిరించి.. మావోయిస్టు సభలకు తీసుకెళ్తున్నారు. మేము అభివృద్ధి చెందేది ఎప్పడంటూ కర పత్రాల్లో ప్రశ్నించారు. ఆదివాసీ సంఘాలు, ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల హెచ్చరికలతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి